ETV Bharat / offbeat

సంక్రాంతి స్పెషల్ : సూపర్ టేస్టీ "కొబ్బరి బూరెలు" - అరిసెలు రానివారు ఈజీగా చేసేయొచ్చు! - SANKRANTI 2025 SPECIAL RECIPE

ఎంతో రుచికరంగా ఉండే కొబ్బరి బూరెలు - ఇలా చేస్తే అరిసెలను మించిన టేస్ట్​!

HOW TO MAKE KOBBARI BURELU
Kobbari Burelu Recipe (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 7, 2025, 3:53 PM IST

Kobbari Burelu Recipe in Telugu : మనందరికీ సంక్రాంతి అనగానే ముందుగా గుర్తొచ్చే పిండి వంటకం అరిసెలు. అయితే, చాలా మందికి వీటిని ఎలా చేయాలో తెలియదు. అలాంటి వారికోసమే సంక్రాంతి వేళ ఒక అద్భుతమైన రెసిపీ తీసుకొచ్చాం. అదే "కొబ్బరి బూరెలు". ఇవి అరిసెల కంటే సూపర్ టేస్టీగా ఉంటాయి! ఇంటిల్లిపాదీ చాలా చాలా ఇష్టంగా తింటారు. పైగా వీటిని అరిసెల కంటే సులభంగా ఎవరైనా తయారు చేసుకోవచ్చు. మొదటిసారి చేసేవారూ ఈ టిప్స్ ఫాలో అవుతూ చేసుకున్నారంటే పర్ఫెక్ట్​గా వస్తాయి. ఇంతకీ, ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలేంటి? తయారీ విధానమేంటో ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు :

  • బియ్యం - 1 కేజీ
  • పచ్చి కొబ్బరి ముక్కలు - ఒకటిన్నర నుంచి 2 కప్పులు
  • బెల్లం - 600 గ్రాములు
  • యాలకుల పొడి - 1 టీస్పూన్
  • నెయ్యి - 2 టేబుల్​స్పూన్లు
  • నూనె - డీప్​ ఫ్రైకి తగినంత

తయారీ విధానం :

  • ముందుగా ఒక గిన్నెలో బియ్యాన్ని తీసుకొని శుభ్రంగా కడిగి కనీసం 20 గంటలపాటు నానబెట్టుకోవాలి. అయితే, ఇలా రైస్​ని నానబెట్టుకున్నప్పుడు మధ్యమధ్యలో వాటర్ మారుస్తుండాలి. లేదంటే బియ్యం స్మెల్ వచ్చే అవకాశం ఉంటుంది.(రేషన్ బియ్యం అయితే బూరెలు మరింత రుచికరంగా, సాఫ్ట్​గా వస్తాయి)
  • ఆవిధంగా బియ్యాన్ని నానబెట్టుకున్న తర్వాత నీళ్లు లేకుండా వడకట్టి ఫ్యాన్ కింద ఒక పొడి క్లాత్​పై పలుచగా పరచి ఆరబెట్టుకోవాలి. మరీ, డ్రైగా ఆరబెట్టుకోకుండా చేతితో పట్టుకుంటే కాస్త తడి తగిలేవిధంగా ఉండాలి.
  • అనంతరం మిక్సీ జార్​లో ఆరబెట్టుకున్న బియ్యాన్ని వేసుకొని మెత్తని పిండిలా గ్రైండ్ చేసుకోవాలి. ఆపై ఒక వెడల్పాటి ప్లేట్​(బేషన్)​ తీసుకొని అందులో మిక్సీ పట్టుకున్న పిండిని జల్లించుకొని చేతితో చక్కగా అదిమి పక్కనుంచాలి.
  • ఇప్పుడు మరో మిక్సీ జార్ తీసుకొని అందులో సన్నగా కట్ చేసుకున్న పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకొని తురుములా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి.
  • ఆ తర్వాత రెసిపీలోకి పాకాన్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇందుకోసం స్టౌపై గిన్నె పెట్టుకొని బెల్లం, పావు లీటర్ వాటర్ యాడ్ చేసుకొని మరిగించుకోవాలి.
  • బెల్లం పూర్తిగా కరిగాక మరో బౌల్​లోకి దాన్ని వడకట్టుకోవాలి. అనంతరం వడకట్టుకున్న బెల్లం నీళ్ల గిన్నెను మళ్లీ స్టౌపై ఉంచి మీడియం ఫ్లేమ్ మీద పాకం వచ్చేంత వరకు కలుపుతూ ఉడికించుకోవాలి.
  • పాకం ఎలా రావాలంటే ఉండకట్టకూడదు, అలాగని లేతపాకం కాకుండా కాస్త ఉండకడుతున్నట్లు ఉండాలి. అయితే, పాకం పర్ఫెక్ట్​గా వచ్చిందని ఎలా తెలుసుకోవాలంటే ఒక చిన్న బౌల్​లో కొద్దిగా నీరు తీసుకొని అందులో గరిటెతో కొద్దిగా పాకాన్ని వేసుకుంటే అది మరీ ఉండకట్టకుండా చేతితో తీసుకుంటే కాస్త జారుడుగా ఉండాలి.
  • ఆవిధంగా పాకం వచ్చాక మరో రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. ఆ తర్వాత మిక్సీ పట్టుకున్న కొబ్బరి తురుము, యాలకుల పొడి వేసి బాగా కలిపి 5 నుంచి 10 నిమిషాల పాటు ఉడికించాలి. అనంతరం అందులో నెయ్యి వేసుకొని కలుపుకోవాలి. పాకంలో వేసిన కొబ్బరి ఉడికి, కాస్త చిక్కగా మారాక స్టౌ ఆఫ్ చేసుకొని దింపుకోవాలి.

పొంగల్ స్పెషల్ : క్రిస్పీ అండ్ టేస్టీ "రిబ్బన్ పకోడా, చెక్కలు, కొబ్బరి మురుకులు" - చేసుకోండిలా!

  • ఇప్పుడు ఆ పాకంలో ముందుగా మిక్సీ పట్టుకున్న తడి బియ్యప్పిండిని కొద్దికొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. అయితే, పిండి కన్సిస్టెన్సీ అనేది సాఫ్ట్​గా, జారుతూ ఉండాలని గుర్తుంచుకోవాలి.
  • ఆవిధంగా పిండిని సిద్ధం చేసుకున్నాక దానిపై కొద్దిగా నెయ్యి చల్లుకొని మూతపెట్టి 10 నిమిషాల పాటు చల్లార్చుకోండి. అంటే పిండి చేతితో పట్టుకోవడానికి వీలుగా ఉండాలి.
  • ఇప్పుడు స్టౌపై కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. అనంతరం చల్లారిన పిండిని కొద్దిగా తీసుకొని పాలిథిన్ కవర్ లేదా బటర్ పేపర్ మీద కాస్త నెయ్యిని అప్లై చేసి అరిసెల మాదిరిగా వత్తుకోవాలి. ఆపై నెమ్మదిగా కాగుతున్న నూనెలో వేసుకోవాలి.
  • తర్వాత గరిటెతో బూరె మీదికి కొద్దిగా ఆయిల్ తోస్తుండాలి. అప్పుడు అది చక్కగా పొంగుతుంది. అలా పొంగిన తర్వాత మరో సైడ్​కి తిప్పుకోవాలి. రెండు వైపులా చక్కగా వేగిన తర్వాత ప్లేట్​లోకి తీసుకోవాలి. ఇలా పిండి మొత్తాన్ని ప్రిపేర్ చేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరంగా ఉండే "కొబ్బరి బూరెలు" రెడీ!
  • అయితే, ఆయిల్​లో వేసుకునేటప్పుడు కొబ్బరి బూరెలు విరిగిపోతున్నాయి, పాకం సరిగ్గా రాలేదనుకుంటే ఈ టిప్ ఫాలో అవ్వండి. అదేంటంటే మీరు పిండి మిక్స్ చేసుకున్న గిన్నెను మళ్లీ స్టౌపై పెట్టి సన్నని సెగ మీద గరిటెతో కలుపుతూ 10 నిమిషాల పాటు కుక్ చేయండి. అలా చేయడం ద్వారా అందులో ఉండే తేమ అంతా పోయి పాకం కాస్త గట్టిపడుతుంది. ఆ తర్వాత పైన చెప్పిన విధంగా బూరెలు చేసుకుంటే సరిపోతుంది.

సంక్రాంతి స్పెషల్​ స్వీట్స్ : అద్దిరిపోయే "బూందీ లడ్డూ, బెల్లం గవ్వలు, గర్జలు" - సింపుల్​గా చేసుకోండిలా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.