Oneplus 13 Series: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వన్‌ప్లస్ 13 సిరీస్ ఇవాళ మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వనున్నాయి. ఈ సిరీస్‌లో కంపెనీ వన్‌ప్లస్ 13, వన్‌ప్లస్ 13R అనే రెండు మోడల్ మొబైల్స్‌ను తీసుకురానుంది. ఈ ప్రీమియం రేంజ్ స్మార్ట్ఫోన్ల డిజైన్, పనితీరు, ఫీచర్లలో చాలా అప్‌డేట్‌లను చేసింది. లాంఛ్ చేసేందుకు ఒక రోజు ముందుగా అంటే నిన్ననే కంపెనీ వీటిలోని కొన్ని ఫీచర్లు, అప్డేట్ల గురించి సమాచారాన్ని అందించింది.
డిస్ప్లే డిజైన్: కంపెనీ ఈ లైన్లో కర్వ్డ్ డిస్‌ప్లేను రీప్లేస్ చేసింది. ఈ రెండు ఫోన్లూ కొత్త ఫ్లాట్ డిస్‌ప్లేతో వస్తాయి. ఇది వీటికి పూర్తిగా కొత్త లుక్‌ను అందిస్తుంది.
కెమెరా మాడ్యూల్: వీటి కెమెరా మాడ్యూల్ పాత మోడల్స్ మాదిరిగానే వృత్తాకారంగా ఉంటుంది. అయితే కెమెరా బంప్‌ని ఫోన్ ఫ్రేమ్‌కి కనెక్ట్ చేసే డిజైన్ ఎలిమెంట్ మాత్రం తీసేశారు. దీంతో ఈ స్మార్ట్ఫోన్ల రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి.
వన్‌ప్లస్ 13 వేగన్ లెదర్, గ్లాస్ ఫినిషింగ్‌లో వస్తుంది. ఇది వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్‌తో IP68, IP69 రేటింగ్‌లతో వస్తుంది. అయితే వన్‌ప్లస్ 13Rలో మాత్రం కస్టమర్లు లెదర్ ఆప్షన్‌ను పొందలేరు.
బ్యాటరీ అండ్ సాఫ్ట్వేర్: ఈ రెండు కొత్త ఫోన్లూ శక్తివంతమైన 6,000mAh బ్యాటరీతో వస్తాయి. ఇది ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఈ రెండు ఫోన్లు ఆండ్రాయిడ్ 15 ఆధారిత ఆక్సిజన్ OS15 పై రన్ అవుతాయి.
కంపెనీ వీటిలో వన్‌ప్లస్ 13 ఫోన్‌తో నాలుగు సంవత్సరాల ఆండ్రాయిడ్ అప్‌డేట్‌లతో పాటు ఐదు సంవత్సరాల సెక్యూరిటీ అప్డేట్స్ను అందిస్తుందని టెక్ నిపుణులు భావిస్తున్నారు. అయితే వన్‌ప్లస్ 13Rపై కంపెనీ మూడు సంవత్సరాల ఆండ్రాయిడ్ అప్‌డేట్‌లతో పాటు నాలుగేళ్ల పాటు సెక్యూరిటీ అప్‌డేట్‌లను అందిస్తుంది.
ట్రిపుల్ కెమెరా సెటప్: వన్‌ప్లస్ 13 ఫోన్ 50MP సోనీ LYT-808 ప్రైమరీ సెన్సార్, 50MP టెలిఫోటో లెన్స్, 50MP అల్ట్రా-వైడ్ కెమెరాను కలిగి ఉంటుందని సమాచారం. మరోవైపు వన్‌ప్లస్ 13R 50MP ప్రైమరీ సెన్సార్, 50MP టెలిఫోటో లెన్స్, 8MP అల్ట్రా-వైడ్ సెన్సార్‌ని పొందవచ్చు. వన్‌ప్లస్ 13R అనేది కంపెనీ R-సిరీస్‌లో టెలిఫోటో లెన్స్‌తో వచ్చిన మొదటి స్మార్ట్‌ఫోన్.
ధర: మన ఇండియన్ మార్కెట్లో వన్‌ప్లస్ 13 ధర రూ.67,000 నుంచి రూ.70,000 మధ్య ఉండొచ్చు. అదే సమయంలో వన్‌ప్లస్ 13R ను రూ. 50,000 కంటే తక్కువ ధరకే లాంఛ్ చేయొచ్చు. దీని కంటే వన్‌ప్లస్ 13 ఫోన్ ఎక్కువ ధరతో తీసుకొచ్చేందుకు కారణం అందులో ఉన్న స్నాప్‌డ్రాగ్ 8 ఎలైట్ చిప్‌సెట్. అయితే దీనిపై కంపెనీ ఇంకా ఎలాంటి అధికారిక సమాచారం అందించలేదు. ఇవాళ రాత్రి 9 గంటలకు ఈ మొబైల్స్ లాంఛ్ ఈవెంట్లో వీటిపై మరిన్ని వివరాలు రివీల్ కానున్నాయి.
అంతరిక్షంలో అంకురోత్పత్తి- ఆకులు తొడిగిన అలసంద- సత్తా చాటిన ఇస్రో
సిట్రోయెన్ బసాల్ట్ SUV ధర పెంపు- గరిష్టంగా రూ.28,000!- ఇప్పుడు దీని రేటెంతంటే?
ఆల్‌టైమ్ రికార్డ్ బ్రేక్ చేసిన రాయల్ ఎన్ఫీల్డ్- ఈసారి ఎన్ని బైక్‌లు అమ్ముడయ్యాయో తెలుసా?