Woman Aggression on Behavior of the Police: మహిళను అడ్డుకున్న పోలీసులు.. ఏం హక్కుందని ఆపారంటూ ఆగ్రహం - కల్లూరు అశ్విని వీడియోలు
🎬 Watch Now: Feature Video
Published : Sep 11, 2023, 10:34 PM IST
Woman Aggression on Behavior of the Police: రాష్ట్రవ్యాప్తంగా.. టీడీపీ బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో... 144సెక్షన్ అమలులో ఉంది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళను పోలీసులు అదుపులోకి తీసుకునేందుకు చేసిన ప్రయత్నం ఉద్రిక్తతలకు దారి తీసింది. పోలీసుల అత్యుత్సాహం ప్రదర్శించడంతో ఆ మహిళ పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబును రిమాండ్ విదించిన పథ్యంలో టీడీపీ నాయకులు, శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా బంద్కు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో ఉదయం నుంచి పోలీసులు పలు ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేసిన అనుమానం వచ్చిన వారిని అదుపులోకి తీసుకుంటున్నారు. అందులో భాగంగా నెల్లూరు జిల్లా కావలిలో తాను రోడ్డుపై వెళ్తుంటే పోలీసులు స్టేషన్‌కి తీసుకెళ్లడానికి యత్నించారంటూ కల్లూరు అశ్విని అనే మహిళ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ అధికారంతో తనని ఆపారంటూ... ఆమె పోలీసులను నిలదీశారు. తానేమీ నేరాలు, ధర్నాలు, హత్యలు చేయలేదని... అలాంటప్పుడు ఎలా ఆపుతారంటూ... పోలీసులను ప్రశ్నించారు. ఎక్కడికైనా వెళ్లే స్వేచ్ఛ తనకుందంటూ.. దానికి అడ్డు చెప్పే హక్కు ఎవరికీ లేదంటూ తీవ్రంగా మండిపడ్డారు.