AP Governer on Chandrababu Arrest చంద్రబాబు అరెస్టుపై సమాచారం ఇవ్వకపోవటంపై గవర్నర్‌ విస్మయం ? టీడీపీ నేతలతో భేటీకి అపాయింట్​మెంట్..! - స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసు న్యూస్

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telugu Team

Published : Sep 9, 2023, 7:54 PM IST

TDP Leaders to Meet Governor Tomorrow:  స్కిల్‌ డెవలప్‌మెంట్‌ (Skill development) కేసులో ఆరోపణలపై, తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును అరెస్టుపై సమాచారం ఇవ్వకపోవడం పట్ల గవర్నర్‌ జస్టిస్ అబ్దుల్ నజీర్(Governor Justice Abdul Nazir) విస్మయం వ్యక్తంచేశారు. ప్రతిపక్ష నేత అరెస్టుపై రాజ్‌భవన్‌కు సమాచారం ఇవ్వకుండా...  ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై గవర్నర్‌ అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే చంద్రబాబును పోలీసులు చంద్రబాబును తాడేపల్లిలోని సిట్‌ కార్యాలయానికి తరలించారు. చంద్రబాబు అరెస్ట్(Chandrababu arrested) నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు నెలకొన్న వేళ... టీడీపీ  నేతలను  రేపు ఉదయం 9.45 గం.కు ఉదయం కలిసేందుకు గవర్నర్‌ అపాయింట్‌మెంట్ ఇచ్చారు.

 రేపు ఉదయం  గవర్నర్‌ను గంటా, గణబాబు, బండారు, పల్లా కలవనున్నారు. ఇప్పటికే  పలువురు నేతలు టీడీపీ  నేతలను పోలీస్​లు గృహనిర్భంధం నుంచి కదలనివ్వడం లేదు. గవర్నర్ నాలుగు రోజుల పర్యటన కోసం నిన్న విశాఖ వచ్చారు. గవర్నర్ అబ్దుల్ నజీర్‌ ప్రస్తుతం విశాఖ పోర్టు గెస్ట్‌హౌస్‌(Visakha Port Guest House)లో ఉన్న  ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్త ఆందోళన నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వం కక్షపూరిత చర్యలకు పాల్పడుతోందని టీడీపీ నేత గవర్నర్​కు ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తోంది.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.