Pawan Kalyan: 'తెలంగాణ ప్రజలకు వైఎస్సాఆర్​సీపీ క్షమాపణ చెప్పాలి' - Pawan Kalyan fires on YSRCP

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Apr 17, 2023, 1:41 PM IST

Pawan Kalyan fires on YSRCP: తెలంగాణ ప్రజలకు వైఎస్సాఆర్​సీపీ క్షమాపణ చెప్పాలని... జనసేన అధినేత పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. ఏపీలో అభివృద్ధిపై తెలంగాణ మంత్రి హరీశ్​రావు చేసిన వ్యాఖ్యలపై.. వైఎస్సాఆర్​సీపీ నేతలు మితిమీరి స్పందిస్తున్నారని పవన్ అభిప్రాయపడ్డారు. హరీశ్​రావుకు సమాధానం చెప్పకుండా తెలంగాణ ప్రజలను ఆ పార్టీ నేతలు తిట్టడం సరికాదన్నారు. పాలకుల వ్యాఖ్యలను ప్రజలకు ఆపాదించకూడదని స్పష్టం చేశారు. 

వైఎస్సాఆర్​సీపీ నాయకులందరికీ హైదరాబాద్​లో వ్యాపారాలున్నాయని.. అలాంటప్పుడు ఇక్కడి ప్రజల్ని ఎలా తిడతారని పవన్ ప్రశ్నించారు. అదుపుతప్పి మాట్లాడే నాయకులను మందలించాల్సిన బాధ్యత సీఎంకు, మంత్రులకు ఉందని జనసేనాని అన్నారు. ఈ మేరకు పవన్ కల్యాణ్ వీడియో సందేశాన్ని జనసేన పార్టీ సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసింది. 

అయితే ఇటీవల మంత్రి హరీశ్​రావు వ్యాఖ్యలపై వైఎస్సాఆర్​సీపీ మంత్రులు తీవ్రంగా మండిపడ్డారు. తెలంగాణ మంత్రి హరీశ్​రావు కల్లు తాగిన కోతిలా మాట్లాడుతున్నారని ఏపీ మంత్రి సీదిరి అప్పలరాజు ధ్వజమెత్తారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తే బిడ్ వేస్తామన్నా హరీశ్​రావు వ్యాఖ్యలపై మాట్లాడిన మంత్రి అప్పలరాజు... కేసీఆర్​తో పాటు ఆయన కుటుంబ సభ్యులపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.