ETV Bharat / state

పెళ్లి కాకుండా ప్రీ వెడ్డింగ్‌ షూట్‌ అశుభమా? - ఆధ్యాత్మికవేత్తలు ఏం చెప్తున్నారంటే? - PRE WEDDING PHOTOSHOOT PROBLEMS

తెలుగు రాష్ట్రాల్లో ఈ నెలాఖరు నుంచి పెళ్లిళ్ల సందడి - పరిధి దాటుతున్న ఫోటో, ప్రీవెడ్డింగ్‌ షూట్‌లు కొన్నిసార్లు ప్రమాదకరంగానూ మారుతున్న ప్రివెడ్డింగ్‌ షూట్‌లు

Pre Wedding Photoshoot Problems
Pre Wedding Photoshoot Problems (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 23, 2025, 7:03 PM IST

Pre Wedding Photoshoot Problems : పెళ్లి ఖర్చు ఓ వైపు ఆకాశాన్ని అంటితే కల్యాణం పేరుతో కొన్ని పెడపోకడలు కూడా ప్రవేశిస్తున్నాయి. ముఖ్యంగా ప్రీ వెడ్డింగ్‌ షూట్‌, ఫోటో షూట్‌ల పేరుతో జరుగుతున్న హంగామా కొన్ని సార్లు హద్దులు దాటుతోంది. అన్ని మతాల్లోనూ అత్యంత పవిత్రమైన ఘట్టమైన పెళ్లి తంతు అసహ్యంగా కూడా మారుతోంది. కొందరు ఆసుపత్రులు, శ్మశానాలు, బురదలో షూట్‌ చేయించుకుంటున్నారు. నదులు, సముద్రాలు, కొండలు వంటి ప్రదేశాల్లో షూట్‌ చేయించుకుంటూ కొందరు ప్రాణాలు కోల్పోయిన ఉదంతాలూ ఉన్నాయి.

రకరకాల లొకేషన్లలో వీడియో షూట్ :పెళ్లంటే జీవితంలో ఒక్కసారి మాత్రమే జరిగే కార్యక్రమం. ఈ జ్ఞాపకాన్ని కలకాలం దాచుకోవాలని ఒకప్పుడు ఫోటోలు, వీడియోలు తీయించుకునే వారు. అయితే ఇప్పుడు ఆ పరిధి దాటి ఫోటో షూట్‌, ప్రీవెడ్డింగ్‌లు వచ్చేశాయి. పెళ్లి చేసుకోబోయే జంట కొన్ని రోజుల ముందే ఏదైనా అందమైన ప్రదేశానికి వెళ్లి ఫోటో షూట్ జరిపించుకుంటున్నారు. ఆ వీడియోను పెళ్లి రోజు పెద్ద వీడియో తెరలపై ప్రదర్శిస్తున్నారు. మొదట్లో పట్టణాలలో ఉన్న ఈ సంస్కృతి ఇప్పుడు పల్లెలకూ పాకింది. ఇటీవలి కాలం వరకు పెళ్లి రోజు ఫ్లెక్సీ పెట్టించడానికి రెండు, మూడు రోజుల ముందు వధూవరులు ఫొటో దిగేవారు. ఇదే ఆధునీకరణ చెందుతూ ప్రీవెడ్డింగ్ షూట్‌గా మారింది. ఫొటోలకే పరిమితం కాకుండా సినిమా పాటలకు డాన్స్ చేస్తూ రకరకాల లొకేషన్లలో వీడియో షూట్ చేయించుకుంటున్నారు.

ఇతరుల కంటే భిన్నంగా ఉండాలనే తాపత్రయం : ప్రీ వెడ్డింగ్‌ షూట్‌ల ద్వారా పెళ్లిని ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేసుకోవాలని భావించడంలో తప్పు లేకున్నా ఇటీవల కాలంలో అది కట్టుతప్పడమే ఆందోళన కల్గిస్తోంది. ఇవి ఒక్కోసారి శృతి మించుతున్నాయి. ఇతరుల కంటే భిన్నంగా ఉండాలనే తాపత్రయంతో కొందరు ఆసుపత్రులు, శ్మశానాలు, బురదలో సైతం షూట్ చేయించుకుంటున్నారు. శ్మశానం అంటే కీడుగా భావిస్తుంటారు. అయితే పవిత్రమైన పెళ్లికి సంబంధించిన ఘట్టాన్ని అక్కడ జరిపించుకుంటూ దీన్ని అపవిత్రంగా మారుస్తున్నారు. హైదరాబాద్‌లో ఓ పోలీసు తన భార్యతో కలిసి స్టేషన్‌లో పోలీస్ వాహనం ముందు ఈ తరహా షూట్ చేయడం సంచలనమైంది. ఇద్దరూ పోలీసులే కావడం, శుభ కార్యం కావడంతో అధికారులు పెద్దగా పట్టించుకోలేదు. ప్రమాదకర ప్రదేశాల్లో ఫోటో షూట్‌ జరిపించుకుంటూ ప్రాణాలు కోల్పోయిన వారూ ఉన్నారు. ఉత్తరాఖండ్‌లో ఓ జంట నదిలో ఫొటో షూట్ చేయటానికి వెళ్లి అకస్మాత్తుగా నీటి మట్టం పెరగడంతో కొట్టుకుపోయారు.

వేలం వెర్రిగా ప్రీ వెడ్డింగ్‌ షూట్ : ఒకప్పుడు పెళ్లి అంటే అమ్మాయిలు సిగ్గుతో తల ఎత్తుకునే వాళ్లే కాదు అనే మాట తరచూ వింటూనే ఉంటాం. నిజంగానే పెళ్లిళ్లు ఒకప్పుడు అలాంటి పద్ధతుల్లో జరిగేవి. పెళ్లి కూతురుగా ముస్తాబైన తర్వాత అలంకరణ చెదిరిపోతుందని, లేక ఇంకా వేరు వేరు కారణాలతో పెళ్లి కూతురును పెద్దవారు ఇంటి నుంచి బయటకు రానిచ్చేవారు కాదు. కానీ ఇటీవల యువతులు పెళ్లికూతురు ముస్తాబులో ఏకంగా బుల్లెట్‌ బైక్‌ నడుపుతూ చక్కర్లు కొడుతూ ఆ వీడియోలను మీడియాలో వైరల్‌ చేస్తున్నారు. ప్రీ వెడ్డింగ్‌, హల్దీ, మెహందీ, పోస్టు వెడ్డింగ్‌, బేబీ బంప్‌ వీడియోలు షూట్‌ చేసుకోవడం సాధారణంగా మారిపోయింది. మితీమీరనంత వరకు ఏదైనా మంచిదే అంటున్నారు- నిపుణులు. ప్రీ వెడ్డింగ్‌ అనేది వేలం వెర్రిగా మారుతోందంటున్నారు.

కెమిస్ట్రీ ఉండాలంటూ ప్రీవెడ్డింగ్‌ : ఆధ్యాత్మివేత్తలు. పెళ్లి ఆడంబరాల కోసం చేస్తున్న ఖర్చులు పరమ వృథాగా అభివర్ణిస్తున్నారు. ఆ క్షణం చేసిన ఏర్పాట్లు, పెట్టిన ఖర్చు ఎందుకు పనిరాదని హితవు పలుకుతున్నారు. ప్రీవెడ్డింగ్‌ షూట్‌లు, ప్రత్యేకమైన థీమ్స్‌లో జరుగుతున్న తతంగం కొన్నిచోట్ల అసహ్యంగా సాగుతోందని, క్లోజ్‌గా మూవ్‌ కావాలంటూ ఇంకా పెళ్లికాని యువతీయువకులపై ఒత్తడి తీసుకురావడం అనుకోని ఇబ్బందులకు కారణమవుతోందని వారిస్తున్నారు. కెమిస్ట్రీ ఉండాలంటూ ప్రీవెడ్డింగ్‌ వేడుకల సందర్భంగా చేస్తోన్న సూచనలను, తల్లిదండ్రులే గట్టిగా నియంత్రించాలే తప్ప పౌరసమాజం కాదని అంటున్నారు.

ప్రీ వెడ్డింగ్‌ షూట్‌ అనేది అశుభం : ప్రీ వెడ్డింగ్‌ షూట్‌ తరువాత అనుకోని పరిస్థితిలో వివాహం ఆగిపోతే అప్పుడు అమ్మాయి పరిస్థితి ఏమిటనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి. ఈలోగా ప్రీవెడ్డింగ్‌ దృశ్యాలు సోషల్ మీడియాలోకి వస్తే ఆ తరువాత అమ్మాయి పెళ్లి ఇబ్బంది అవుతుందనే వాదన ఉంది. ప్రీ వెడ్డింగ్‌ షూట్‌ల కోసం చేస్తున్న ఆడంబర ఖర్చులన్నీ వృథా అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. వీటి కోసం ఆర్థిక సాయం చేసేందుకు ఫైనాన్స్‌ కంపెనీలు పుట్టుకొచ్చి అదో పరిశ్రమగా మారుతోంది. వీడియో ఫోటోలకు పది నుంచి 15 లక్షల రూపాయల వరకు వదలించుకుంటున్నారని ఊటీ వరకు వెళ్లి ఫోటోషూట్‌లు తీయించుకుంటూ తండ్రిని భారీగా లూటీ చేస్తున్నారని సున్నితంగా మందలిస్తున్నారు. అంత ఖర్చు చేసి వివాహాలు చేస్తున్నందునే- నవ దంపతుల మధ్య అహం పెరిగి రెండు, మూడేళ్లకు విడిపోతున్న ఉదంతాలున్నాయని నిపుణులు అంటున్నారు. పెళ్లి కాకుండా ప్రీ వెడ్డింగ్‌ షూట్‌ అనేది అశుభం అని ఆధ్యాత్మికవేత్తలు అంటున్నారు.

అప్పులు తెచ్చి పెళ్లి : తెలుగు రాష్ట్రాల్లో ఈ నెలాఖరు నుంచి మళ్లీ పెళ్లిళ్ల సందడి ప్రారంభం కానుంది. మే నెల వరకు మూహూర్తాలు ఉన్నాయి. మాఘమాసంలో పెళ్లి చేయాలనుకుంటున్న తల్లిదండ్రులు ఇప్పటికే హడావుడిలో ఉన్నారు. పేద కుటుంబాలు సైతం అప్పులు తెచ్చి ఒక పెళ్లికి సగటున 10 లక్షలకుపైగా ఖర్చు పెడుతున్నాయి.

ఈ క్రమంలోనే ఖర్చులు హద్దులు దాటుతున్నాయి. అందువల్ల పేద, మధ్యతరగతి ప్రజలు హంగులు, ఆర్భాటాలకు వెళ్లకుండా, అప్పుల పాలు కాకుండా పెళ్లిళ్లు చేస్తేనే మేలనే వాదన వినిపిస్తోంది. యువత కూడా ప్రీ వెడ్డింగ్‌ షూట్‌ పేరుతో అసహ్యం కల్గించే రీతిలో కాకుండా హద్దుల్లో ఉంటే మేలని ఆధ్యాత్మికవేత్తలు సూచిస్తున్నారు.

'ఎంత ఖర్చైనా ఫర్వాలేదు పెళ్లి మాత్రం మస్త్​గా జరగాలి'

ఆపరేషన్ థియేటర్​లో ప్రీ వెడ్డింగ్ షూట్​- వీడియో వైరల్​, డాక్టర్​ డిస్మిస్​!

నలుగురికి నచ్చినది, మాకసలే నచ్చదంటున్న నవ దంపతులు - ప్రీవెడ్డింగ్ పేరుతో వింతలు, విన్యాసాలు ​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.