ETV Bharat / state

కిడ్నీ ఇచ్చిన వారికి ఇంకా డబ్బులు అందలేదు : డా.నాగేంద్ర - ALAKNANDA HOSPITAL KIDNEY RACKET

కిడ్నీ రాకెట్‌ అంశంలో మరింత విచారించాల్సి ఉందన్న డా. నాగేంద్ర - ప్రభుత్వం నియమించిన కమిటీ అధ్యక్షుడు డా. నాగేంద్రతో ఈటీవీ ముఖాముఖి

Doctor Nagendra Interview On Alaknanda Hospital Kidney Racket
Doctor Nagendra Interview On Alaknanda Hospital Kidney Racket (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 23, 2025, 7:08 PM IST

Doctor Nagendra Interview On Alaknanda Hospital Kidney Racket : హైదరాబాద్ కిడ్నీ రాకెట్‌ అంశంలో శస్త్రచికిత్స అలకనంద ఆస్పత్రిలోనే జరిగిందా అనేది మరింత విచారించాల్సి ఉందని, ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ అధ్యక్షుడు డాక్టర్‌ నాగేంద్ర తెలిపారు. ఆస్పత్రి సీజ్‌ చేసినందు వల్ల లోతుగా దర్యాప్తు సాధ్యం కాలేదని వెల్లడించారు. ఆర్థిక ఇబ్బందులున్న వారే లక్ష్యంగా బ్రోకర్లతో కలిసి దందాకు పాల్పడుతున్నట్లు వివరించారు. పోలీసులతో సమన్వయం చేసుకుంటూ విచారించి, తుది నివేదిక ఇవ్వాల్సి ఉందంటున్న డాక్టర్‌ నాగేంద్రతో ఈటీవీ భారత్​ ముఖాముఖి.

"కిడ్నీ రాకెట్ వ్యవహారాన్ని ప్రభుత్వం సీరియస్​గా తీసుకుంది. కిడ్నీ ఇచ్చిన వారు తమిళనాడు చెందిన వారు. మాయమాటలు చెప్పి వారిని హైదరాబాద్​కు తీసుకువచ్చారు. కిడ్నీ తీసుకునేవారు రూ.50 లక్షలు ఆసుపత్రి యాజమాన్యానికి ఇచ్చారు. కిడ్నీ డొనేట్ చేసేవారికి డబ్బులు ఇంకా ఇవ్వలేదు."- డాక్టర్‌ నాగేంద్ర, కమిటీ అధ్యక్షుడు

ప్రభుత్వానికి అందిన నివేదిక : ఆర్గాన్ రాకెట్​కు సంబంధించి అందరిని కలవరపాటుకు గురిచేసిన సరూర్‌నగర్ అలకనంద ఆసుపత్రి ఘటనలో విస్తుగొలిపే వాస్తవాలు వెలుగు చూశాయి. తమిళనాడుకు చెందిన ఇద్దరు ఒంటరి మహిళల ఆర్ధిక పరిస్థితిని ఆసరాగా చేసుకొని దళారులు బరిగితెగించినట్లు వైద్యారోగ్య శాఖ విచారణలో వెలుగు చూసింది. దాదాపు 5 గంటలకు పైగా బాధితులతో మాట్లాడిన అనంతరం డాక్టర్ నాగేందర్ ఆధ్వర్యంలోని వైద్యుల బృందం ఘటనపై ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. ఆ నివేదికలో పలు కీలక అంశాలు పొందుపరిచినట్టు సమాచారం.

ఎంతకు తెగించార్రా - అలకనంద కిడ్నీ రాకెట్​లో విస్తుగొలిపే విషయాలు

అలకనంద ఆసుపత్రిలో కిడ్నీ మార్పిడి నిజమే : డీఎంఈ వాణి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.