పులినే భయపెట్టిన ఆవు.. దూడను కాపాడుకునేందుకు ఏం చేసిందంటే?
🎬 Watch Now: Feature Video
పులి దాడి నుంచి బిడ్డను కాపాడుకుంది ఓ ఆవు. దైర్యం చేసి పులినే భయపెట్టి.. దూడ ప్రాణాలు రక్షించింది. పులి నోటికి చిక్కిన ఆ లేగ దూడను.. దానికి ఆహారం కాకుండా చేసింది. ఉత్తరాఖండ్‌లోని పౌడీ గడ్వాల్ జిల్లాలో ఈ ఘటన జరిగింది.
జిల్లాలోని ధుమాకోట్, రిఖానిఖాల్ ప్రాంతంలో పులులు ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి. గురువారం మధ్యాహ్నం.. రిఖానిఖాల్, పాప్డి గ్రామంలోని ఓ వ్యవసాయ పొలంలోకి పులి వచ్చింది. అనంతరం అక్కడున్న పశువులను చంపేందుకు ప్రయత్నించింది. చివరగా ఓ దూడ వెంటపడుతూ.. దానిపై పంజా విసిరేందుకు ప్రయత్నం చేసింది. కొద్ది సేపు వెంటాడిన తరువాత దూడ పులికి చిక్కింది. వెంటనే దాన్ని గమనించిన దూడ తల్లి.. అక్కడకు పరుగున వచ్చింది. పులిని బెదిరించి.. అక్కడి నుంచి తరిమివేసింది. బిడ్డ ప్రాణాలను కాపాడుకుంది. ఈ దృశ్యాన్ని మొత్తం అక్కడున్న వ్యక్తి వీడియో తీశారు. ఆ ప్రాంతంలోని పులుల.. గ్రామాలు, వ్యవసాయ పొలాల్లోకి రాకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అయినప్పటికి ఈ తరహా ఘటనలు జరుగుతూనే ఉన్నాయి.