2024 Cricket Controversies : క్రికెట్ అంటే టన్నుల కొద్దీ పరుగులు, వందల కొద్దీ వికెట్లు, కళ్లు చెదిరే ఫీల్డింగ్ విన్యాసాలు, అరుదైన రికార్డులు. ఇవి మాత్రమే కాదు, క్రికెట్లో అనేక రకాల వివాదాలు కూడా ఉంటాయి. 2024వ సంవత్సరం క్రికెట్లో ఉత్కంఠ భరితమైన మ్యాచ్‌లతో పాటు కొన్ని కాంట్రవర్సీలను కూడా అందించింది. అటు అభిమానులు, ఇటు ఎక్స్‌పర్ట్‌లు తెగ చర్చించేసుకున్న టాప్ 5 వివాదాల గురించి ఇప్పుడు చూద్దాం.
శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ వివాదం : బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టుల జాబితా నుంచి శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్‌ను తప్పించి సంచలన నిర్ణయం తీసుకుంది. గత సీజన్‌లో రంజీ ట్రోఫీకి వారు గైర్హాజరవడం వల్ల బీసీసీఐ ఆగ్రహించింది. అయితే నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA) రాబోయే దేశీయ సీజన్ కోసం తమ హై- పెర్ఫార్మెన్స్ మానిటరింగ్ ప్రోగ్రామ్‌లో ఇద్దరు ఆటగాళ్లను చేర్చింది. విమర్శకులు ఈ చర్యను తప్పుబట్టారు. మినహాయించిన ఆటగాళ్లకు అకస్మాత్తుగా ఎందుకు ప్రాధాన్యత ఇస్తున్నారని ప్రశ్నించారు.
సూర్యకుమార్ యాదవ్ క్యాచ్ : 2024 టీ20 ప్రపంచ కప్‌లో దక్షిణాఫ్రికాపై భారత్ విజయం సాధించింది. సూర్యకుమార్ యాదవ్ (SKY) బౌండరీ లైన్ అందుకున్న సూపర్ క్యాచ్‌తో మ్యాచ్ మలుపు తిరిగింది. ఈ క్యాచ్ అందుకునే క్రమంలో సూర్యకుమార్ రోప్‌ని టచ్ చేశాడా? లేదా? అని థర్డ్ అంపైర్ చాలా యాంగిల్స్‌లో టెస్ట్ చేశాడు. చివరికి అవుట్ అని ప్రకటించాడు. అయితే సూర్యకుమార్ యాదవ్ రోప్‌కి తగిలాడని, భారత్‌కు ప్రయోజనం చేకూర్చేలా నిర్ణయం ఉందనే ఆరోపణలు వినిపించాయి.
BEST VIEW OF SURYAKUMAR YADAV CATCH IN T20 WORLD CUP 2024#worldcup2024 pic.twitter.com/qclrTnfRZT
— FREEHIT BALL (@KhanaaAli) December 12, 2024
లిచ్‌ఫీల్డ్ LBW నిర్ణయం : కీలక మ్యాచ్‌లో డెసిషన్ రివ్యూ సిస్టమ్ (DRS) నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. ఆస్ట్రేలియన్ ఉమెన్స్ ప్లేయర్ ఫోబ్ లిచ్‌ఫీల్డ్ ఎల్‌బీడబ్ల్యూగా అవుట్ అయింది. అంపైర్ అవుట్ ఇచ్చాక, ఆమె రివ్యూ కోరింది. లెగ్ స్టంప్ వెలుపల బంతి పిచ్ అయిందని థర్డ్ అంపైర్ అవుట్ కాదని ప్రకటించాడు. అయితే లిచ్‌ఫీల్డ్ బాల్ ఆడేముందు స్టాన్స్ మార్చిందని, ఆమె రైట్ హ్యాండ్ బ్యాటింగ్ ఆడినట్లు పరిగణించాలని భారత ప్లేయర్లు వాదించారు. అంపైర్ వ్యవహరించిన తీరుపై పెద్ద ఎత్తున చర్చలు నడిచాయి.
లలిత్ మోదీ పాడ్‌కాస్ట్ : ఐపీఎల్ మాజీ కమీషనర్ లలిత్ మోదీ షాకింగ్ పాడ్‌కాస్ట్‌తో క్రికెట్ ప్రపంచాన్ని షేక్ చేశారు. చెన్నై సూపర్ కింగ్స్ (CSK) యజమానులు అంపైర్ నిర్ణయాలను తారుమారు చేయడం, బంతులను మార్చడం, వేలంలో రిగ్గింగ్ చేయడం వంటి అనైతిక పద్ధతులను అనుసరించినట్లు ఆరోపించారు. ఈ ఆరోపణలు తీవ్ర చర్చలకు దారితీశాయి. కొందరు లలిత్ వ్యాఖ్యలను నిరాధారమైనవని కొట్టిపారేశారు. మరికొందరు పూర్తి విచారణకు డిమాండ్ చేశారు.
పాండ్యపై ఫ్యాన్స్ ఫైర్ : 2024లో ఐపీఎల్ అభిమానులకు హార్దిక్ పాండ్య టార్గెట్ అయ్యాడు. దాదాపు ప్రతి మ్యాచ్‌లో పాండ్యపై ముంబయి ఫ్యాన్స్ వ్యతిరేకత వ్యక్తం చేశారు. ముంబయి ఇండియన్స్ (MI)కి తిరిగి రావడానికి గుజరాత్ టైటాన్స్‌ను వదిలేశాడనే పుకార్లు వినిపించాయి. రోహిత్ శర్మ ఉండగా కెప్టెన్సీ తీసుకోవడం వివాదాస్పమైంది. ఈ తీరు ముంబయి అభిమానులకే కాదు, ఐపీఎల్ అభిమానులకు కూడా నచ్చలేదు.
Hardik Pandya walks in… ! He was greeted with boos at the Wankhede. These boos are not solely for #HardikPandya . But, also now!!#MIvKKR pic.twitter.com/VJCx85w0ot
— Amrit Pradhan (@amritpradhan63) May 3, 2024