Horoscope Today December 28th, 2024 : డిసెంబర్ 28వ తేదీ (శనివారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?
మేషం (Aries) : మేషరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలలో ఆటంకాలు, ప్రతికూల పరిస్థితులు ఉంటాయి. ముఖ్యంగా ఈ రాశి వారు ఈ రోజు కోపాన్ని నియంత్రణలో ఉంచుకోవాలి. మాట్లాడే ప్రతిమాట ఆలోచించి మాట్లాడాలి. ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రయాణాలు కలిసిరావు. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. నవగ్రహ శ్లోకాలు పఠించడం శ్రేయస్కరం.
వృషభం (Taurus) : వృషభరాశి వారికి ఈ రోజు ఆనందదాయకంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఈ రోజు కుటుంబ సౌఖ్యం, ఆర్థిక వృద్ధి, కార్యసిద్ధి వంటి శుభ ఫలితాలు ఉంటాయి. సమాజంలో పేరు, ప్రఖ్యాతులు సాధిస్తారు. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు అందుకుంటారు. వృత్తి, వ్యాపారాలలో సానుకూల ఫలితాలు ఉంటాయి. ఉన్నత పదవులు చేపడతారు. ఆరోగ్యం బాగుంటుంది. ఇష్ట దేవతారాధన శుభప్రదం.
మిథునం (Gemini) : మిథునరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాలవారు ఈ రోజు తమ తమ రంగాలలో విజయవంతంగా చాలా పనులు పూర్తి చేస్తారు. సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. గృహంలో ప్రశాంత వాతావరణం ఉండవచ్చు. అదనపు ఆదాయం సమకూరుతుంది. వృధా ఖర్చులు పెరగవచ్చు. శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు. మీ పనితీరుకు మంచి గుర్తింపు, ప్రశంసలు లభిస్తాయి. శ్రీలక్ష్మీ దేవి ధ్యానం శుభప్రదం.
కర్కాటకం (Cancer) : కర్కాటకరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని పనుల్లో చురుగ్గా ఉంటారు. ప్రతికూల ఆలోచనలు, ఆపదలు తొలగిపోతాయి. ఉద్యోగంలో నూతన బాధ్యత తీసుకుంటారు. సానుకూల ఆలోచనలతో శుభ ఫలితాలు ఉంటాయి. ఆర్థికంగా కలిసి వస్తుంది. శివాలయ సందర్శనం మేలు చేస్తుంది.
సింహం (Leo) : సింహరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. కుటుంబ కలహాలకు ఆస్కారముంది. కోపాన్ని అదుపులో ఉంచుకొని ప్రశాంతంగా ఉంటే గొడవలు ఉండవు. ప్రతికూల ఆలోచనల కారణంగా శారీరక ఆరోగ్యం, మానసిక ప్రశాంతత కొరవడుతుంది. వృత్తి, వ్యాపారాలలో అనుకోని సమస్యలు, ఆటంకాలు ఏర్పడటం వల్ల అశాంతితో ఉంటారు. ఆర్థిక పరిస్థితి నిరాశాజనకంగా ఉంటుంది. నీటి గండం ఉంది. కాబట్టి జలాశయాలకు దూరంగా ఉండండి. అభయ ఆంజనేయ స్వామి ఆలయ సందర్శనతో ఆపదలు తొలగుతాయి.
కన్య (Virgo) : కన్యారాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి శ్రమకు తగిన ఫలితాలు లభిస్తాయి. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సహకారంతో చేపట్టిన అన్ని పనులు విజయవంతంగా పూర్తవుతాయి. అనుకోని సంపదలు కలిసి రావడం వల్ల ఆనందంగా ఉంటారు. వ్యాపారులు మంచి లాభాలు ఆర్జిస్తారు. స్థిరాస్తుల్లో పెట్టుబడి పెట్టేందుకు ఇది తగిన రోజు. ఆరోగ్యం సహకరిస్తుంది. ఇష్ట దేవతారాధన శుభకరం.
తుల (Libra) : తులారాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలుంటాయి. వృత్తి వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితాలుంటాయి. ఇతరులు చెప్పిన మాటలు నమ్మి మోసపోయే ప్రమాదముంది. స్వబుద్ధితో, ఆలోచించి వివేకంతో చేసే పనులు సత్ఫలితాలనిస్తాయి. మొండి వైఖరి వీడితే మంచిది. ఉద్యోగులకు ప్రమోషన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఆర్థికంగా బలోపేతం అవుతారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టాలి. శివారాధన శ్రేయస్కరం.
వృశ్చికం (Scorpio) : వృశ్చికరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలలో కష్టించి పనిచేసి, మంచి విజయాలను అందుకుంటారు. ఆదాయం పెరుగుతుంది. మీ ప్రియమైన వారితో మంచి సమయాన్ని గడుపుతారు. విలాసాల కోసం అధికంగా ధనవ్యయం చేస్తారు. విహారయాత్రలకు వెళతారు. ఈ రోజంతా ఆనందంగా, సంతోషంగా గడుపుతారు. ఇష్ట దేవతారాధన శుభకరం.
ధనుస్సు (Sagittarius) : ధనుస్సురాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. అన్ని రంగాల వారు ముఖ్యమైన వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. వ్యాపారంలో నూతన ప్రాజెక్టులు, ఒప్పందాలు వాయిదా వేస్తే మంచిది. కుటుంబంలో ఇబ్బందికర పరిస్థితులు ఉండవచ్చు. ఆర్థిక పరిస్థితి నిరాశాజనకంగా ఉంటుంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ఆదిత్య హృదయం పారాయణతో మెరుగైన ఫలితాలు ఉండవచ్చు.
మకరం (Capricorn) : మకరరాశి వారికి ఈ రోజు అద్భుతంగా ఉంటుంది. సన్నిహితులు, స్నేహితులు, ఇష్టమైన బంధువులను కలుసుకుంటారు. స్నేహితుల నుంచి ఆశ్చర్యకరమైన బహుమతి అందుకుంటారు. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ఆదాయం పెరుగుతుంది. విదేశాల నుంచి శుభవార్తలు అందుకుంటారు. ఇష్ట దేవతారాధన శుభప్రదం.
కుంభం (Aquarius) : కుంభరాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. వృత్తి పరంగా అన్ని పనులు అనుకూలంగా జరుగుతాయి. ఉద్యోగ, వ్యాపారాలలో రాణిస్తారు. మీ పనికి ప్రశంసలు దక్కుతాయి. ఆత్మవిశ్వాసం అధికంగా ఉంటుంది. క్లిష్టమైన పనిని సునాయాసంగా పూర్తి చేస్తారు. సంపదలు కలిసి వస్తాయి. శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ మేలు చేస్తుంది.
మీనం (Pisces) : మీన రాశివారు చాలా అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఇది. కీలకమైన వ్యవహారాలలో స్థిరమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. మానసికంగా దృఢంగా ఉండాలి. మీ స్వధర్మమే మిమ్మల్ని కాపాడుతుంది. ఆర్థికపరమైన మోసాలకు గురి అయ్యే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. కుటుంబ శ్రేయస్సు కోసం పని చేస్తారు. ఖర్చులు అదుపులో ఉంచుకోవడం అవసరం. గణపతి ఆలయ సందర్శన మేలు చేస్తుంది.