Chandrababu CID Remand Report: స్కిల్ డెవలప్‌మెంట్ వ్యవహారం.. కోర్టుకు సీఐడీ రిమాండ్ రిపోర్టు
🎬 Watch Now: Feature Video
Published : Sep 10, 2023, 8:56 AM IST
|Updated : Sep 10, 2023, 3:27 PM IST
Chandrababu CID Remand Report : తెలుగుదేశం అధినేత చంద్రబాబు అరెస్టు వ్యవహారంలో మొదట్నుంచీ ఇష్టారాజ్యంగా వ్యవహరించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ACB అధికారులు అదే ధోరణి కొనసాగించారు. ఈ ఉదయం ఆరు గంటలకు ఆయన్ను కోర్టులో ప్రవేశపెట్టారు. ఆ తర్వాత కోర్టుకు...రిమాండ్ రిపోర్టు సమర్పించారు. 2021 నాటి FIRలో లేని చంద్రబాబు పేరును.. అధికారులు..తాజాగా చేర్చారు.
Chandrababu in ACB Court Updates : మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్షనేత చంద్రబాబును అరెస్టు చేసి ఏసీబీ కోర్టు ముందు హాజరు పరిచిన సీఐడీ అధికారులు రిమాండ్ రిపోర్టును కోర్టులో దాఖలు చేశారు. స్కిల్ డెవలప్మెంట్ వ్యవహారంలో చంద్రబాబను ప్రధాన కుట్రదారుగా పేర్కోన్న సీఐడీ ఆయన్ను ఏ37 గానే పేర్కొంటూ రిమాండ్ రిపోర్టు సమర్పించింది. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంతో పాటు వివిధ అక్రమాల్లో ఆయన పాత్ర ఉందని స్పష్టం చేస్తూ తదుపరి విచారణ కోసం ఆయనకు 15 రోజుల జ్యుడిషియల్ కస్టడీ ఇవ్వాలని పేర్కోంది. ఈమేరకు సీఐడీలోని ఆర్ధిక నేరాల విభాగం డీఎస్పీ ధనుంజయుడు పేరిట రిమాండ్ రిపోర్టును ఏసీబీ కోర్టుకు సమర్పించింది.
Chandrababu in ACB Court: ఏసీబీ కోర్టులో చంద్రబాబును హాజరు పర్చిన సీఐడీ స్కిల్ డెవలప్మెంట్ వ్యవహారంలో రిమాండ్ రిపోర్టు సమర్పించింది. రిమాండ్ రిపోర్టులో చంద్రబాబును ఏ 37 గానే పేర్కోంటునే అభియోగాలను పేర్కోంది. స్కిల్ డెవలప్మెంట్ వ్యవహారానికి సంబంధించిన నేరంలో ఆయనే ముఖ్యమైన కుట్రదారని స్పష్టం చేసింది. ప్రజాప్రతినిధిగా ఉండి ఆయన నేరపూరిత కుట్రకు పాల్పడ్డారని పేర్కోంది. 2021 డిసెంబరు 9 కంటే ముందు ఈ నేరం జరిగిందని రిమాండ్ రిపోర్టులో స్పష్టం చేసింది. తాడేపల్లిలోని స్కిల్ డెవలప్మెంట్ కార్పోరేషన్ కేంద్రంగా వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ అక్రమాలు జరిగాయని వెల్లడించింది.
స్కిల్ డెవలప్మెంట్ కు సంబంధించి సీమెన్స్ ప్రాజెక్టు కోసం ప్రభుత్వ వాటాగా 371 కోట్ల రూపాయలను చెల్లించారని పేర్కోంది. ఇందులో 279 కోట్ల రూపాయల మేర ప్రజాధనం షెల్ కంపెనీలకు దారిమళ్లాయని పేర్కోంటూ రిమాండ్ రిపోర్టు దాఖలు చేసింది. ఏపీలోని నైపుణ్యాభివృద్ధి కార్యక్రమం అమలు కోసం సీమెన్స్ ఇండస్ట్రీస్ సాఫ్ట్ వేర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ , మెస్సర్స్ డిజైన్ టెక్ సిస్టమ్స్ లిమిటెడ్ పేరిట ఈ కుంభకోణం జరిగిందని పేర్కోంది. రాష్ట్రవ్యాప్తంగా 6 సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ కేంద్రాలు అలాగే 36 టెక్నికల్ స్కిల్ డెవలప్మెంట్ సంస్థలు ఏర్పాటు చేయటం లక్ష్యంగా ఒప్పందం చేసుకున్నారని..
Chandrababu Arrest News Updates : సీమెన్స్ ద్వారా చేపట్టనున్న ప్రాజెక్టు వ్యయాన్ని 3281 కోట్ల రూపాయల మేర ఉంటుందని పేర్కోన్నారని స్పష్టం చేసింది. ఇందులో 10 శాతం రాష్ట్రవాటాగా జీవో నెంబరు 4 ద్వారా టెక్నాలజీ భాగస్వాములైన మెస్సర్స్ డిజైన్ టెక్ లిమిటెడ్ కు 371 కోట్లను విడుదల చేశారని రిమాండ్ రిపోర్టులో తెలిపింది. చెల్లింపులు జరిగిన మొత్తానికి సంబంధించిన వస్తుసేవలను మెస్సర్స్ డిజైన్ టెక్ సంస్థ ప్రభుత్వానికి అందించలేదని సీఐడీ స్ఫష్టం చేసింది. అలాగే 241 కోట్ల రూపాయలకు సంబంధించిన లావాదేవీల్లో నకిలీ బిల్లులు ఉన్నట్టుగా మహారాష్ట్రలోని జీఎస్టీ ఇంటెలిజెన్స్ గుర్తించినట్టు పేర్కోంది.
అసలు స్కిల్ ఎక్స్ లెన్స్ కేంద్రాలకు ఎలాంటి పరికరాలు, సాఫ్ట్ వేర్ సరఫరా చేయకుండా నకిలీ బిల్లులతో షెల్ కంపెనీలకు నిధులు మళ్లించారని రిమాండ్ రిపోర్టులో అభియోగం మోపింది. షెల్ కంపెనీల బ్యాంకు ఖాతాల నుంచి హవాలా ద్వారా నిధులు కాజేశారని పేర్కోంది
ఈ కేసులో ఏ1 గా ఉన్న గంటా సుబ్బారావు, సౌమ్యాద్రి శేఖర్ బోస్, వికాస్ కన్వేల్కర్, ముకుల్ చంద్ర అగర్వాల్, శిరీష్ చంద్రకాంత్ షా, విపిన్ శర్మ, నీలం శర్మలను అరెస్టు చేశామని తెలియచేసింది. దారిమళ్లించిన నిధులకు సంబంధించిన అంశంలో ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించామని పేర్కోంది. మొత్తం 26 మంది నిందితులపై అభియోగాలు ఉన్నట్టు వెల్లడించింది. ఈ కేసులో 141 మంది సాక్షులను కూడా విచారించి వారి స్టేట్ మెంట్లు నమోదు చేసినట్టు తెలియచేసింది. ఏ-37గా చంద్రబాబు పేరును ఎఫ్ఐఆర్ లో చేర్చేందుకు 2023 సెప్టెంబరు 8 తేదీన మెమో దాఖలు చేసినట్టు వెల్లడించింది. పన్ను ఎగవేతపై జీఎస్టీ ఇంటెలిజెన్స్ సంస్థ దర్యాప్తు ప్రారంభించే సరికి సచివాలయంలోని నోట్ ఫైల్స్ ను మాయం చేశారని పేర్కోంది. 2015-2019 వరకూ ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు డిజైన్ టెక్ కు ప్రయోజనం కలిగించేలా వ్యవహరించారని పేర్కోంటూ రిమాండ్ రిపోర్టు దాఖలు చేసింది. ప్రభుత్వ ఆర్ధిక వనరులకు భారీగా నష్టం కలిగిన ఈ కేసులో తుది లబ్దిదారు చంద్రబాబు అని పేర్కోంటూ రిమాండ్ రిపోర్టును సమర్పించింది. ఈ వ్యవహారంలో పూర్తి సమాచారం తెలిపిన చంద్రబాబును అరెస్టు చేసి విచారణ చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరింది.
అలాగే షెల్ కంపెనీల ద్వారా నిధులు మళ్లించిన వ్యవహారంలో ఐటీ శాఖ నోటీసులు ఇచ్చిందని స్పష్టం చేసింది. అమరావతిలో కాంట్రాక్టు పనులు అప్పగించిన షాపూర్ జీ పల్లోంజి, ఎల్ ఎంటీ లిమిటెడ్ కు చెందిన షెల్ కంపెనీల ద్వారా ముడుపులు స్వీకరించారని వెల్లడించింది. గతంలో చంద్రబాబు పీఏ పెండ్యాల శ్రీనివాస్, కిలారు రాజేష్ ల ద్వారా నిధులు స్వీకరించారని తెలిపింది.ఈ కేసులో సంబంధం ఉన్న పి. శ్రీనివాస్ మనోజ్ వాసుదేవ్ పార్దసానిలు విదేశాలకు పరారు అయ్యేందుకు చంద్రబాబు సహకరించారని పేర్కోంది. వివిధ కుట్రల్లో భాగస్వామిగా ఉన్న చంద్రాబాబును ప్రశ్నించేందుకు 15 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి ఇవ్వాలని కోరింది. ఈమేరకు సీఐడీలోని ఆర్ధికనేరాల విభాగం డీఎస్పీ ధనుంజయుడు పేరిట రిమాండ్ రిపోర్టును దాఖలు చేసింది.