5కిలోల 'బాహుబలి' నిమ్మకాయలను పండిస్తున్న రైతు- ఎక్కడంటే?

By ETV Bharat Telugu Team

Published : Dec 24, 2023, 1:42 PM IST

thumbnail

Big Size Lemon Cultivation In Karnataka : బాహుబలి నిమ్మకాయలను పండిస్తున్నారు కర్ణాటకకు చెందిన ఓ రైతు! 5 కిలోల, 6 అడుగుల భారీ నిమ్మకాయలను తన కాఫీ తోటలో సాగు చేస్తున్నారు. వీటిని ఆర్గానిక్ పద్ధతిలోనే ఆయన పండించడం విశేషం.  

కొడగు జిల్లాలోని పలిబెట్ట ప్రాంతానికి చెందిన విజు సుబ్రమణి ఈ భారీ నిమ్మకాయలను పండిస్తున్నారు. 'నాలుగేళ్ల క్రితం ఓ రోజు మైసూర్​ మార్కెట్​కు వెళ్లినప్పుడు నిమ్మచెట్టు విత్తనాలను కొనుగోలు చేశాను. ఆ తర్వాత వాటిని నా ఇంటికి సమీపంలో ఉన్న గార్డెన్​లో నాటాను. పెరిగిన మొక్కలను తీసి కాఫీ తోటలో సాగు చేశాను. అయితే మూడేళ్లకు నిమ్మచెట్లు పెరిగి పెద్దవయ్యాయి. అయినప్పటికీ ఆ చెట్లకు నిమ్మ పువ్వులు, కాయలను గానీ కాయలేదు. దీంతో ఆ చెట్టు నిమ్మచెట్టా? కాదా అనే అనుమానం కలిగింది. అక్కడికే కొద్ది రోజులకే పంట రావడం మొదలైంది. కొన్ని నెలల తర్వాత అవి పెద్దవిగా మారి భారీ పరిమాణంలో కాశాయి' అని విజు సుబ్రమణి తెలిపారు.  

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.