ETV Bharat / state

'విద్యుత్​ వినియోగదారులకు' అదిరిపోయే వార్త - ఈ ఏడాది మొత్తం 'విద్యుత్​ ఛార్జీలు ఉండవ్' - NO POWER TARIFF HIKE TELANGANA

తెలంగాణలో కరెంటు ఛార్జీల పెంపు లేదు - ఈఆర్‌సీకి సమర్పించిన ఏఆర్‌ఆర్‌ నివేదికలో పేర్కొన్న డిస్కంలు - విద్యుత్‌ పంపిణీ సంస్థలకు రూ.20,151 కోట్ల లోటు రావొచ్చని అంచనా

no increase electricity charges  in Telangana
Power Charges in Telangana 2025 (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 29, 2025, 9:41 AM IST

Power Charges in Telangana 2025 : వచ్చే ఆర్థిక సంవత్సరం(2025-26)లో కరెంటు ఛార్జీలు పెంచడం లేదని రాష్ట్ర విద్యుత్‌ పంపిణీ సంస్థ(డిస్కం)లు చెప్పాయి. రాబోయే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక ఆదాయ అవసరాల(ఏఆర్‌ఆర్‌) నివేదికను ఈఆర్‌సీకి సమర్పించాయి. ఈఆర్‌సీ ఛైర్మన్‌ విదేశీ పర్యటనలో ఉన్నందున నివేదికను మీడియాకు వెల్లడించలేదు. ఆయన వచ్చిన తరవాత నివేదికను ప్రజల ముందు పెట్టి బహిరంగ విచారణ చేస్తామని ఈఆర్‌సీ వర్గాలు పేర్కొన్నాయి. ఏటా మార్చి ఆఖరులోగా నివేదికపై ప్రజల సమక్షంలో మండలి బహిరంగ విచారణ జరిపి తుది ఉత్తర్వులు ఇవ్వాలని విద్యుత్‌ చట్టంలో ఉంది.

కరెంటు ఛార్జీలు : వచ్చే ఏడాది ఆదాయం కన్నా వ్యయం రూ.20,151 కోట్లు అధికంగా ఉంటుందని డిస్కంలు తెలిపాయి. ఈ సొమ్మును రాష్ట్ర ప్రభుత్వం రాయితీ పద్దు కింద బడ్జెట్‌లో కేటాయిస్తే ఛార్జీలు పెంచాల్సిన అవసరం లేదని పేర్కొన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024-25)లో రాయితీ పద్దు కింద రూ.12 వేల కోట్లను ప్రభుత్వం కేటాయించింది. వచ్చే ఏడాది ఏర్పడే లోటును భర్తీ చేయాలంటే మరో రూ.8 వేల కోట్లకు పైగా పెంచి మొత్తం రూ.20,151 కోట్లను బడ్జెట్‌లో కేటాయించాల్సి ఉంటుంది.

డిస్కంల నిర్వహణ వ్యయం : రెండేళ్లుగా కరెంటు ఛార్జీలను పెంచకపోవడంతో డిస్కంలకు ఆదాయం పెద్దగా పెరగలేదు. రాష్ట్రంలో విద్యుత్‌ వినియోగం రోజురోజుకు భారీగా పెరుగుతున్నందున డిస్కంల నిర్వహణ వ్యయం ఆకాశాన్నంటుతోంది. ప్రస్తుతం అమల్లో ఉన్న కరెంటు ఛార్జీల ప్రకారం వచ్చే ఏడాది రూ.45,698 కోట్ల ఆదాయం వస్తుందని ఈఆర్‌సీకి డిస్కంలు వివరించాయి. వ్యయం రూ.65,849 కోట్లకు చేరుతున్నాయన్నారు. రూ.20,151 కోట్ల ఆర్థికలోటు ఏర్పడుతున్నాయని డిస్కంలు వివరించాయి.

ఆర్థికలోటు : గ్రేటర్‌ హైదరాబాద్‌ కేంద్రంగా గల దక్షిణ డిస్కంకు వచ్చే ఆదాయం రూ.36,277 కోట్లు కాగా వ్యయం రూ.46,035 కోట్లు ఉంటుందని అంచనా. వరంగల్‌ కేంద్రంగా గల ఉత్తర డిస్కంకు వచ్చే ఏడాది ఆదాయం రూ.9,421 కోట్లు రావొచ్చని, వ్యయం రూ.19,814 కోట్లు ఉంటుందని నివేదికలో తెలిపాయి. ఉత్తర తెలంగాణలో వ్యవసాయ బోర్లకు, కాళేశ్వరం, పలు ఎత్తిపోతల పథకాలకు కరెంటు వినియోగం అధికంగా వాడుతున్నందున ఆర్థికలోటు అధికంగా ఉంటుందని అంచనా.

ఇళ్లకు ఉచితానికి రూ.2,400 కోట్లు : రాష్ట్ర ప్రభుత్వం గృహజ్యోతి పథకం కింద పేదల ఇళ్లకు నెలకు 200 యూనిట్ల వరకు కరెంటును ఉచితంగా ఇస్తుంది. దీనికి వచ్చే ఏడాది దాదాపు రూ.2,400 కోట్లు అవసరమని అంచనా. అదనపు ఆదాయం కోసం ఛార్జీలను పెంచితే బాగుంటుందని డిస్కంలు తెలిపినా.. ప్రజలపై భారం వేయవద్దని ప్రభుత్వం తెలిపినట్లు సమాచారం. వచ్చే నెలలో శాసనసభలో ప్రవేశపెట్టనున్న రాష్ట్ర బడ్జెట్‌లో విద్యుత్‌ రంగానికి ఎన్ని నిధులు కేటాయించనుందనేది ప్రభుత్వం వెల్లడించనుంది. దాని ప్రకారం ఏఆర్‌ఆర్‌పై ఈఆర్‌సీ తుది నిర్ణయం తీసుకోనుంది.

మీ దగ్గర కూడా మీటర్లు కాలిపోతున్నాయా? - అదే ప్రధాన కారణం!

మీటర్ల ట్యాంపరింగ్ అంటే ఇదేనేమో భయ్యా - ట్రిపుల్​​ బెడ్​రూం ఇంటికి కరెంట్​ బిల్​ రూ.72!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.