ETV Bharat / state

మీరు కేసు పెట్టిన పోలీసులు పట్టించుకోవడం లేదా? దురుసుగా ప్రవర్తిస్తున్నారా? - ఈ క్యూఆర్​ కోడ్​ స్కాన్​ చేయండి చాలు - QR CODE TO TRACK POLICE PERFORMANCE

పోలీసుల పనితీరుపై క్యూఆర్‌ కోడ్‌ - 20 రోజుల్లో ఆరు వేల ఫిర్యాదులు - త్వరలో విస్తరణ యోచనలో పోలీస్‌ అధికారులు

QR code for police behaviour
QR Code To Track Police Performance (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 30, 2025, 12:11 PM IST

QR Code To Track Police Performance In Telangana : పోలీసులు ఆయా స్టేషన్లలో ఎలా పనిచేస్తున్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నారా లేదా అని ప్రజలు తమ అభిప్రాయాలను తెలియజేయవచ్చు. కేసులు పట్టించుకోకున్నా, వారు మీతో దురుసుగా ప్రవర్తించిన దీంట్లో తెలపవచ్చు. అదేంటని ఆలోచిస్తున్నారా. తాజాగా పోలీసుల పట్ల ప్రజల అభిప్రాయాలను తెలుసుకునేందుకు పోలీస్ శాఖ 'క్యూఆర్ కోడ్' విధానాన్ని ప్రారంభించింది. దీనివల్ల పోలీస్ స్టేషన్లలో ఎలాంటి అవినీతికి పాల్పడడానికి వీలుండదు. పోలీసులు ఎలా ఉంటున్నారో భాధితులు దీంట్లో తెలుపవచ్చు.

ప్రజలకు తోడు క్యూఆర్‌ కోడ్‌ : పోలీసుల పనితీరును తెలుసుకుంటూ ప్రజలకు మెరుగైన సేవలను అందించేందుకు ఆ శాఖ ప్రారంభించిన క్యూఆర్ కోడ్​కు మంచి స్పందన లభిస్తోంది. ప్రజల నుంచి వస్తున్న అభిప్రాయాలు, ఫిర్యాదులపై దిద్దుబాటు చర్యలు చేపట్టేందుకు పోలీసు ఉన్నతాధికారులు సిద్ధమవుతున్నారు. పోలీసుల తీరును ఎప్పటికప్పుడు కనిపెట్టి వారిని గాడిలో పెట్టడానికి నిర్ణయించారు. ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలని ఆ శాఖ ఉన్నతాధికారులు నిర్ణయించారు.

QR Code To Track Police Performance
పోలీసుల పనితీరుపై క్యూఆర్‌ కోడ్‌ (ETV Bharat)

బహిరంగ ప్రదేశాల్లో కూడా క్యూఆర్​ కోడ్ : ఇందులో భాగంగానే ఈ నెల 9వ తేదీ నుంచి రాష్ట్రంలోని పోలీస్ స్టేషన్లు, పోలీస్ కార్యాలయాలు, కొన్ని ప్రాంతాల్లో బహిరంగ ప్రదేశాల వద్ద కూడా క్యూఆర్​కోడ్​ను పెట్టారు. ప్రజలు ఆయా ప్రాంతాల్లోని క్యూఆర్ కోడ్​ను స్కాన్ చేసి పోలీస్​ శాఖపై అభిప్రాయాలు, పోలీసుల పనితీరు, ప్రవర్తనను తెలపడంతో పాటు ఫిర్యాదుదారు విషయంలో ఎలా ప్రవర్తించాడో అని అడిగే ప్రశ్నలకు సమాధానాలు తెలుపవచ్చు.

ఆరువేలకు పైగా అభిప్రాయాలు : పోలీస్ శాఖ ఈ విధానాన్ని ప్రారంభించిన 20 రోజుల్లోనే రాష్ట్రవ్యాప్తంగా ఆరువేలకు పైగా అభిప్రాయాలు, ఫిర్యాదులు వచ్చాయి. వీటిని పోలీసు అధికారులు పరిశీలన చేస్తూ చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. తమకు సత్వర న్యాయం చేయలేదని, తమను పట్టించుకోలేదని భాదితులు ఎక్కువగా ఈ క్యూఆర్​లో తెలిపారని సమాచారం. పోలీసులపై ఆరోపణలు, ఫిర్యాదులు పెద్దగా రాలేదని తెలిపారు.

గ్రామీణ ప్రజలకు దీనిపై అవగాహన : కానీ పోలీస్ స్టేషన్లకు వచ్చే స్థానికులతో పోలీసులు వారికి అనుకూలంగా ఫీడ్​బ్యాక్ ఇప్పించుకొని ఉంటారని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు పోలీసుల ప్రభావానికి లోనుకాకుండా నగరాలు, పట్టణాల్లోని కూడళ్లు, వివిధ ప్రాంతాల్లోనూ క్యూఆర్ కోడ్ విధానాన్ని ఏర్పాటు చేయాలని పోలీసులు నిర్ణయించుకున్నారు. గ్రామీణ ప్రజలకు దీనిపై అవగాహన కల్పించాలనుకుంటున్నారు. కోడ్​ను స్కాన్ చేసిన తర్వాతే అభిప్రాయాలు, ఫిర్యాదులు, అభ్యంతరాలు తెలిపే విధానాన్ని కూడా ప్రారంభించాలని ఆలోచిస్తున్నారు.

ఆన్​లైన్ నేరాలపై కేంద్రం ఉక్కుపాదం - త్వరలో రంగంలోకి దిగనున్న సైబర్ కమాండోలు - Cyber Commandos Training

మనం ఏం మారలేదు - కొత్త ఏడాది 6 రోజుల్లోనే 120 సైబర్‌ కేసులు, అందులో 30 న్యూడ్ కాల్స్!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.