ETV Bharat / lifestyle

టమాటా, వెల్లుల్లి, బ్రెడ్ ఫ్రిజ్​లో పెడుతున్నారా? వేటిని ఇందులో పెట్టకూడదో తెలుసా? - THINGS SHOULD NOT KEEP IN FRIDGE

-కొన్ని ఆహార పదార్థాలను ఫ్రిజ్​లో పెట్టోదట! -రుచితో పాటు త్వరగా పాడవుతాయని వెల్లడి

THINGS SHOULD NOT KEEP IN FRIDGE
THINGS SHOULD NOT KEEP IN FRIDGE (Getty Images)
author img

By ETV Bharat Lifestyle Team

Published : Jan 30, 2025, 12:36 PM IST

Things Should Not Keep in Fridge: ప్రస్తుత ఆధునిక సమాజంలో దాదాపు అందరి ఇళ్లలో ఫ్రిజ్ సాధారణంగా మారిపోయింది. మార్కెట్లో తెచ్చిన కూరగాయలు, పండ్లు అన్నింటినీ ఫ్రిజ్​లో పెట్టేస్తుంటారు. ముఖ్యంగా తీరిక లేని జీవనశైలి కారణంగా చాలా మంది రకరకాల ఆహార పదార్థాలను ఇలానే ఒకేసారి పెద్దమొత్తంలో తెచ్చిపెట్టుకుంటుటారు. కానీ, కొన్ని ఆహార పదార్థాలను ఫ్రిజ్​లో అసలు పెట్టకూడదని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

తేనె: ఇందులో నీటి శాతం తక్కువగా ఆమ్లతత్వం ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇంకా దీనికి బ్యాక్టీరియాను నిరోధించే గుణం ఉంది కాబట్టి ఫ్రిజ్‌లో పెట్టాల్సిన అవసరం లేదని అంటున్నారు. ఒకవేళ ఫ్రిజ్​లో పెడితే తేనె గట్టిగా మారిపోయి వాడుకోవడానికి అనువుగా ఉండదని వివరిస్తున్నారు.

బ్రెడ్‌: ఫ్రిజ్‌లో బ్రెడ్ పెడితే ఎండిపోయినట్లుగా అవుతుందని.. కాస్త తేమ తగిలితే బూజూ పడుతుందని అంటున్నారు. అలాకాకుండా ఉండేందుకు పొడిగా, చల్లగా ఉండే ప్రదేశంలో ఉంచాలని సూచిస్తున్నారు. లేదంటే ఇప్పుడు వస్తున్న బ్రెడ్‌ స్టోరేజ్‌ బ్యాగుల్లో పెట్టినా సరిపోతుందని చెబుతున్నారు.

Things Should Not Keep in Fridge
ఫ్రిజ్​లో పెట్టకూడని పదార్థాలు (Getty Images)

టమాటాలు: వీటిని ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల వాటి లోపల సూక్ష్మంగా ఉండే ఓ పోషకాహార పొర పోతుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే ఇలా కాకుండా గాలి పొడిగా ఉండే ప్రదేశంలో ఉంచితే సహజంగా ముగ్గి వండేటప్పుడు వాటి రుచి పెరుగుతుందని అంటున్నారు.

అరటిపండ్లు: వీటిని ఫ్రిజ్‌లో ఎట్టి పరిస్థితుల్లో పెట్టకూడదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇలా చేస్తే తొక్క రంగు మారిపోవడమే కాకుండా.. పండ్లూ రుచిని కోల్పోతాయని అంటున్నారు. ఒక్కోసారి తినడానికి పనికిరాకుండా పోతాయని వివరిస్తున్నారు. అందుకే ఫ్రిజ్​కు బదులుగా బ్రౌన్‌పేపర్‌లో చుట్టి పెడితే సరిపోతుందని సూచిస్తున్నారు.

కాఫీ: కాఫీగింజలు, పొడి ఏదైనా సరే ఫ్రిజ్‌లో పెడితే వాటి ఫ్లేవర్‌ పోతుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఫ్రిజ్ చల్లదనానికి ఇందులోని నేచురల్‌ ఆయిల్స్‌ బలహీనపడి రుచీ, వాసన తగ్గిపోతాయని అంటున్నారు.

బంగాళాదుంపలు: వీటిని ఫ్రిజ్‌లో పెడితే ఇందులోని స్టార్చ్‌ చక్కెరగా మారుతుందని నిపుణులు అంటున్నారు. దీంతో వీటిని వేయించినప్పుడు ఆ చక్కెరలు ప్రమాదకర రసాయనాలుగా మారతాయని హెచ్చరిస్తున్నారు. 2017లో Journal of Food Scienceలో ప్రచురితమైన "Storage Conditions for Potatoes" అనే అధ్యయనంలోనూ ఈ విషయం తేలింది.

ఉల్లి- వెల్లుల్లి: వీటిని ఫ్రిజ్‌లో ఉంచితే ఈ రెండింటి వాసన, రుచీ ఇతర పదార్థాలకు అంటుతుందని చెబుతున్నారు. ఇంకా తేమగా ఉంటే కుళ్లిపోయే ప్రమాదమూ ఉందని హెచ్చరిస్తున్నారు. అందుకే అలాకాకుండా గాలి ధారాళంగా వచ్చే చీకటి ప్రదేశంలో ఉంచితే ఎక్కువ రోజులు మొలకెత్తకుండా ఉంటాయని సూచిస్తున్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

గోడలపై గీతలు, ఫర్నీచర్​పై మరకలు మొత్తం పోతాయ్​! హోమ్ క్లీనింగ్​కు సూపర్ టిప్స్!!

అతి ప్రేమతో కొత్త సమస్య - అలా ఊహించుకుంటే ప్రమాదమే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.