ETV Bharat / offbeat

తొక్కిసలాటలో మీరుంటే ఇలా చేయండి - ప్రాణాలతో బయటపడతారు! - KUMBH MELA STAMPEDE

-కుంభమేళాలో 20 మంది మృతి - ఈ ఘోరాలను ఇలా అడ్డుకోండి

Kumbh mela Stampede
Kumbh mela Stampede (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 29, 2025, 10:43 AM IST

Kumbh mela Stampede : ప్రయాగ్​ రాజ్​ మహా కుంభమేళాలో ఘోరం చోటు చేసుకుంది. మౌని అమావాస్య వేళ భక్తుల రద్దీ కారణంగా తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 20 మంది ప్రాణాలు కోల్పోయినట్టు సమాచారం. సుమారు 100 మందికి పైగా గాయాలపాలైనట్టు తెలుస్తోంది. ఇటీవల తిరుపతిలో కూడా ఇలాంటి అపశృతే చోటు చేసుకొని, భక్తులు మరణించారు. ఇలాంటి ఘటనలు గతంలో ఎన్నోసార్లు జరిగాయి. భవిష్యత్తు రోజుల్లో కూడా జరుగుతాయి. మరి, అలాంటి సమయంలో ఆ తొక్కిసలాటలో ఉన్నవారు ఏం చేయాలి? ఎలా ప్రాణాలతో బయటపడాలి? అనే వివరాలను నిమ్స్​ కార్డియాలజీ ప్రొఫెసర్ డాక్టర్​ ఓరుగంటి సాయిసతీష్ తెలియజేస్తున్నారు.

కుంభమేళాలో తొక్కిసలాట- 15 మంది మృతి! 100 మందికి గాయాలు

  • మీరు ఏ జాతరకు వెళ్లినా, లేదా ఏవైనా సభలకు వెళ్లినా, ఇంకేదైనా భారీ జనసందోహ కార్యక్రమానికి హాజరైనా చేయాల్సిన పని ఏమంటే గుంపు మధ్యలో ఉండకూడదు. చివర్లలో ఉండేలా చూసుకోవాలి.
  • తొక్కిసలాట చోటుచేసుకుంటే తమ ప్రాణాలు కాపాడుకునేందుకు జనం హడావిడిగా పరిగెత్తుతారు. ఇలాంటి సమయంలో కిందపడిన వారిని తొక్కుకుంటూ మీదనుంచే వెళ్లిపోతుంటారు. అప్పుడు కిందపడిన వారి చాతిపై తీవ్ర భారం పడుతుంది. రిబ్స్​ విరిగిపోతాయి. గుండె, ఊపిరితిత్తులకు గాయాలవుతాయి. లోపల రక్తస్రావమై చనిపోతారు. కొందరు ఊపిరి తీసుకోలేకపోవడంతో మెదడుకు ఆక్సిజన్ అందక ప్రాణాలు కోల్పోతారు.
  • ఒకవేళ ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఉంటే గనక, కిందపడిపోగానే పక్కకు ఒత్తిగిళ్లి పడుకోవాలి. సహజంగా కిందపడ్డవారు వెల్లకిలా లేదా బోర్లా పడతారు. అలాంటప్పుడు వెంటనే పక్కకు తిరిగి ముడుచుకుని పడుకోవడానికి ట్రై చేయాలి. మీతోపాటు పిల్లలు ఉంటే గనక వారిని మీ పొత్తి కడుపులో పెట్టుకొని పడుకోవాలి. దీనివల్ల గుండెకు, ఊపిరితిత్తులకు గాయాలు కాకుండా చూసుకోవచ్చు.
  • మీరు గుంపు మధ్యలో ఉంటే, తొక్కిసలాట జరిగే ఛాన్స్ ఉన్నట్టు అనిపిస్తే మీరు నిలబడే తీరు వెంటనే మార్చుకోవాలి. బాక్సింగ్​ రింగ్​లో బాక్సర్ నిలబడ్డట్టుగా నిలబడాలి. అంటే రెండు కాళ్లు కాస్త దూరం పెట్టి, పిడికిళ్లు బిగించి, చాతి దగ్గర పెట్టుకొని బాక్సర్ ఫోజులో నిల్చోవాలి.
  • ఇలా చేయడం వల్ల స్టిఫ్​గా నిల్చుంటారు. ఎవరైనా నెట్టినా, త్వరగా ముందుకో, వెనక్కో పడిపోయే అవకాశం ఉండదు.
  • మౌత్​ బ్రీతింగ్, కార్డియోపల్మనరీ రిససిటేషన్ పద్ధతుల గురించి కాస్త అవగాహన చేసుకుంటే మంచిది.
  • అదేవిధంగా సీపీఆర్ గురించి తెలుసుకోవడం అత్యవసరం. మనవాళ్లు తొక్కిసలాటలో స్పృహ కోల్పోతే, వారికి CPR చేస్తే వెంటనే కోలుకునే ఛాన్స్ ఉంటుంది.

తిరుపతిలో తొక్కిసలాట - ఆరుగురు భక్తుల మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.