Pragya Jaiswal About Balakrishna : రిలీజైనప్పటి నుంచి బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తూ దూసుకెళ్తోంది 'డాకు మహారాజ్'. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. బాలయ్య ఎప్పటిలాగే తన నటనతో అభిమానులను అలరించగా, కావేరిగా మెరిసి ప్రజ్ఞా జైస్వాల్ కూడా ఆకట్టుకున్నారు. గతంలో ఈమె బాలయ్యతో 'అఖండలో నటించగా, అది కూడా సూపర్‌హిట్‌గా నిలిచింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె బాలయ్యతో వర్క్ చేయడం గురించి మాట్లాడారు. ఆయనతో వరుస సినిమాల్లో నటించిన అనుభవాన్ని పంచుకున్నారు. ఈ క్రమంలో నటీనటుల మధ్య వయసు వ్యత్యాసం గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
"ఆయన ఓ లెజెండ్. బాలకృష్ణ పేరు చెప్పగానే నాకు 'పాజిటివిటి' అనే పదం గుర్తొస్తుంది. ఆయన నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు చాలానే ఉన్నాయి. మనసులో మాటను నిర్మొహమాటంగా చెప్పగల వ్యక్తి ఆయన. అందరినీ ఒకలాగే గౌరవిస్తారు. చాలా మంచి మనిషి. రోల్‌కు తగ్గట్లుగా యాక్టర్లను ఎంపిక చేస్తారు. అంతే తప్ప వారి వయసును చూసి సినిమా అవకాశాలు ఇవ్వరు. నా పాత్రకు నేను వందశాతం న్యాయం చేశానా, లేదా అనేదే ఆలోచిస్తాను. నా దృష్టిలో ఏజ్ అనేది అసలు సమస్యే కాదు. 'అఖండ'లో మా ఇద్దరినీ స్క్రీన్‌పై చూసి నేను ఆశ్చర్యపోయాను" అని ప్రగ్యా చెప్పుకొచ్చారు.
ఆయన 'డాకు మహారాజ్' అయినే నేను 'డాకు మహారాణి'
"నా బర్త్‌డే టైమ్‌లోనే 'డాకు మహారాజ్' రిలీజై మంచి విజయాన్ని అందుకుంది. ఈ ఇయర్ నాకు అద్భుతంగా ప్రారంభమైందని భావించాను. ఇందులో నేను నటించిన కావేరి పాత్రకు వస్తోన్న రెస్పాన్స్ చూస్తుంటే నాకు ఎంతో ఆనందంగా ఉంది. 'డాకు మహారాజ్' థియేటర్లలోకి వచ్చినప్పటి నుంచి అందరూ నన్ను 'డాకు మహారాణి' అని పిలుస్తున్నారు. ఆ పాత్రకు ఆడియెన్స్ అంతలా కనెక్ట్ అయ్యారు. ఒక నటిగా నాకు ఇది ఎంతో సంతృప్తినిచ్చిన సినిమా. గర్భిణి పాత్రలో నటించడం నాకు ఓ కొత్త అనుభూతి ఇచ్చింది. తనకు పుట్టబోయే బిడ్డ కోసం కావేరి చేసే పోరాటం ప్రేక్షకుల మనసులను ఎంతగానో కదిలించింది. మహిళలు ఎంత బలమైనవారో ఈ పాత్ర చూస్తే అందరికీ అర్థమవుతుంది" అని ప్రగ్యా అన్నారు.
సెకెండాఫ్‌పై 'డాకు' ఎఫెక్ట్ - బాలకృష్ణ కెరీర్లో నిలిచిపోయే పాత్ర ఇది! : డైరెక్టర్ బాబీ
'డాకు మహారాజ్' సక్సెస్ ఈవెంట్ : పాటతో పాటు పవర్ఫుల్ స్పీచ్‌తో బాలయ్య సందడి