Balakrishna Warned YSRCP Government: 'కేసులకు భయపడాల్సింది వైసీపీ నేతలే.. ఇకపై దెబ్బకు దెబ్బ.. వేటుకు వేటు!' - బాలయ్యబాబు

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telugu Team

Published : Sep 14, 2023, 5:14 PM IST

Balakrishna Warned YSRCP Government: కేసులకు భయపడాల్సింది మేము కాదు.. వైసీపీ నేతలే అని టీడీపీ నేత, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నారు. ఏం తప్పు చేశారని చంద్రబాబును జైలులో పెట్టారు.. ఇకపై దెబ్బకు దెబ్బ.. వేటుకు వేటే అని బాలకృష్ణ స్పష్టం చేశారు. టీడీపీ మరింత బలపడుతోందన్న బాలయ్య... రాష్ట్ర భవిష్యత్ కోసమే యుద్ధం ప్రకటించాం అని చెప్పారు. జగన్ ప్రభుత్వంపై యుద్ధంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Klayan) భాగస్వామ్యం కావడం శుభపరిణామం అని పేర్కొన్నారు. 

జగన్ సీఎం కావడం ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం అని చెప్తూ... తప్పు చేసిన వారంతా బయట ఉన్నారు.. రాష్ట్రం బాగు కోసం పనిచేసిన చంద్రబాబు నాయుడు జైలులో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 'మేం భయపడే రకం కాదు.. న్యాయపరంగా ఎదుర్కొంటాం' అని బాలకృష్ణ(NBK) స్పష్టం చేశారు. జనసేన (Janasena) పార్టీ అధ్యక్షుడు పవన్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తో కలిసి బాలకృష్ణ రాజమహేంద్రవరంలో చంద్రబాబుతో ములాఖత్ అయ్యారు. అనంతరం నారా లోకేశ్​తో కలిసి బాలకృష్ణ మీడియాతో మాట్లాడారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.