ETV Bharat / bharat

లాయర్​గా అదరగొట్టిన ఇంటర్ విద్యార్థి- EWS కోటా​ కోసం హైకోర్టులో వాదనలు- జడ్జి ఇంప్రెస్! - CLASS 12TH STUDENT ARGUMENT

ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో EWS రిజర్వేషన్లు అమలు కావడం లేదని హైకోర్టుకు ఇంటర్ విద్యార్థి- స్వయంగా వాదనలు- ఇంప్రెస్ అయిన జడ్జి!

Class 12th Student Argument In High Court
Class 12th Student Argument In High Court (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : 16 hours ago

Class 12th Student Argument In High Court : ఈ డబ్ల్యూఎస్ రిజిర్వేషన్లపై ఓ ఇంటర్​ విద్యార్థి కోర్టులో చేసిన వాదన జడ్జిని ఇంప్రెస్ చేసింది. దీంతో ఆ జడ్జి 'నువ్వు డాక్టర్​ కాదు లాయర్ కావాలి' అని అన్నారు. కనీసం డిబేట్​ కాంపిటీషన్లలో పాల్గొన్న అనుభవం కూడా లేకుండా కోర్టులో లాజికల్ పాయింట్లతో జడ్జిని ఇంప్రెస్ చేశాడు అతడు. తనకు కోర్టు న్యాయం చేయాలని కోరుకున్నాడు. అసలు ఆ ఇంటర్ విద్యార్థి ఎవరు? ఎందుకోసం తన కేసులో తానే వాదనలు వినిపించాల్సి వచ్చింది? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

అక్కడ డౌట్ వచ్చింది!
మధ్యప్రదేశ్​లోని జబల్​పుర్​కు చెందిన లాయర్ మనోజ్ చతుర్వేది కుమారుడు అథర్వ్ చదుర్వేది(19). అథర్వ్ నీట్ 2024 పరీక్షలో 720 మార్కులకు 530 స్కోర్ చేశాడు. ఈడబ్ల్యూఎస్ కోటా కింద ఏదో ఒక ప్రైవేటు కాలేజీలో సీటు కచ్చితంగా వస్తుందని ధీమాగా ఉన్నాడు. అయితే లాస్ట్​ రౌండ్ కౌన్సెలింగ్​లో కూడా అతడిగి సీటు రాలేదు. దీంతో ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్​లు అమలు చేయడం లేదని గ్రహించాడు. అంతేకాకుండా రిజర్వ్ అయిన సీట్లు ఎస్​సీ, ఎస్​టీ, దివ్యాంగులకు అందుబాటులో ఉన్నాయని తెలుసుకున్నాడు.

ఇది తనతో పాటు తనలాంటి ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకు అన్యాయంగా భావించాడు అథర్వ్. ఈ విషయాన్ని తన తండ్రి మనోజ్​ చతుర్వేది చెప్పాడు. అనంతరం మధ్యప్రదేశ్​ హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. మొదటి విచారణలో అథర్వ్ తరఫున అతడి తండ్రి మనోజ్​ వాదించారు. అయితే పిటిషన్​లో నీట్​ పరీక్షను ఛాలెంజ్ చేశారు. దీనిపై పబ్లిక్ ప్రాసిక్యూటర్ అభ్యంతరం తెలిపారు. ఆ తర్వాత ఈ కేసులో తానే వాదనలు వినిపించాలని అథర్వ్ నిర్ణయించుకున్నాడు.

నిర్ణయం అయితే తీసుకున్నాడు కానీ అది అంత సులభం కాదు. అథర్వ్​ స్కూల్​లో ఎప్పుడూ డిబేట్ కాంపిటీషన్లలో పాల్గొనలేదు. చట్టాల గురించి అవగాహన లేదు. అయినా అక్కడితో ఆగాలనుకోలేదు. వాదనలకు ముందు రాజ్యాంగం, చట్టాల్లోని సెక్షన్లు, కోర్టు తీర్పులు, గెజిట్ నోటిఫికేషన్లు వంటి వాటి గురించి చదివి కనీస అవగాహన తెచ్చుకున్నాడు. అనంతరం కోర్టు కార్యకలాపాలు ఎలా జరుగుతాయో తెలుసుకుని, అందుకు అనుగుణంగా వాదనలకు ప్రిపేర్ అయ్యాడు.

అథర్వ్ కోర్టు పెర్ఫామెన్స్
రెండో హియరింగ్​లో అథర్వ్​ లాస్ట్​ బెంచ్​లో కూర్చున్నాడు. అనంతరం పిటిషనర్​ తానే స్వయంగా వాదనలు వినిపించాలనుకుంటున్నట్లు అతడి తండ్రి మనోజ్ కోర్టుకు తెలిపారు. ఈ క్రమంలో అక్కడున్న జూనియర్ లాయర్లు 'ఈ రోజుల్లో పిల్లలు కూడా కోర్టుల్లో వాదిస్తున్నారు' అంటూ కామెంట్లు చేశారు. అవేమీ పట్టించుకోకుండా అథర్వ్ తన వాదన మొదలు పెట్టాడు. తన వాదనలను స్పష్టంగా, లాజికల్​గా కోర్టుకు వివరించి జడ్జిని ఇంప్రెస్ చేశాడు.

ఈ క్రమంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సురేశ్ కుమార్ కెయిట్, జస్టిస్ వివేక్ కుమార్ జైన్- అథర్వ్ వయసు, బ్యాక్​గ్రౌండ్ గురించి వివరాలు అడిగారు. అనంతరం నీట్​ ప్రిపేర్ అవుతున్నానని విద్యార్థి బదులిచ్చాడు. దీంతో చిన్న వయసులోనే చట్టాలపై విద్యార్థికి ఉన్న అవగాహనను జడ్జిలు ప్రశంసించారు. అనంతరం ఓ జడ్జి 'నువ్వు డాక్టర్​ కాదు లాయర్​ కావాలి' అని అథర్వ్​తో అన్నారు.

అథర్వ్ వాదనలు విన్న మధ్యప్రదేశ్​ హైకోర్టు 2024 డిసెంబర్ 17న చారిత్రక తీర్పు ఇచ్చింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో ఈడబ్ల్యూఎస్ కోటా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

'తీర్పును సుప్రీం కోర్టులో సవాల్'
ఈ తీర్పుతో అథర్వ్ సంతృప్తి చెందలేదు. కౌన్సెలింగ్​లో సీట్ల కేటాయింపులో అవకతవకలు జరుగుతున్నాయని కోర్టు దృష్టికి తీసుకువచ్చాడు. దాన్ని పరిష్కరించాలని కోర్టును కోరాడు. అయితే 2024 జులైలో 2న జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్​పై అథర్వ్​కు అవగాహన ఉండాల్సిందని కోర్టు అభిప్రాయపడింది. ఈ తీర్పును సుప్రీం కోర్టులో సవాల్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు అథర్వ్ తెలిపాడు.

'అతడి వయసు చూసి తీర్పు ఇవ్వలేదు'
"కోర్టు అథర్వ్​ వయసు చూసి తీర్పు ఇవ్వలేదు. అతడి వాదనలు, చట్టంపై అవగాహనను పరిగణనలోకి తీసుకుని తీర్పు వెలువరించింది. ఫైనల్ హియరింగ్​ అప్పుడు అథర్వ్ 10 నిమిషాలు ఆలస్యంగా వచ్చాడు. ఈ కేసులో అతడు ఒంటరిగా పోరాడాడు" అని అథర్వ్ తండ్రి మనోజ్ చదుర్వేది తన కుమారుడి విజయం పట్ల ఆనందం వ్యక్తం చేశాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.