Sunil Gavaskar On Rishabh Pant : టీమ్ఇండియా యంగ్ బ్యాటర్ రిషబ్ పంత్‌పై మాజీ ఆటగాడు సునీల్ గావస్కర్ ఫైర్ అయ్యాడు. మెల్బోర్న్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 37 బంతులు ఎదుర్కొన్న పంత్ 26 పరుగులు చేసి బోలాండ్ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. అయితే పంత్ క్రీజులో నిర్లక్యంగా ఆడతూ అనవసరంగా వికెట్ సమర్పించాడని గావస్కర్ మండిపడ్డాడు.
అయితే ఈ మ్యాచ్‌లో పంత్ రెండు సార్లు ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. 2 పరుగుల వద్ద క్యాచౌట్ నుంచి తప్పించుకున్న పంత్, తర్వాత జడేజాతో రన్ ఔట్ ప్రమాదం నుంచి కూడా బయటపడ్డాడు. ఇలా పంత్‌కు ఈ ఇన్నింగ్స్‌లో రెండు సార్లు లైఫ్ లభించింది. ఇక క్రీజులో సెట్ అయినట్లే కనిపించిన అతడు 55.4 వద్ద బొలాండ్ బౌలింగ్‌లో అనవసరంగా స్కూప్ షాట్ అడి ధర్డ్ మ్యాచ్‌ను చిక్కాడు. దీంతో అనవసరంగా ఆసీస్‌కు వికెట్ ఇచ్చేశాడని కామెంటరీ బాక్స్‌లో కూర్చొన్న గావస్కర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
'స్టుపిడ్, స్టుపిడ్, స్టుపిడ్! అక్కడ ఇద్దరు ఫీల్డర్లు ఉన్నారు. అయినా నువ్వు అదే షాట్ ఎంచుకున్నావు. అంతకుముందు కూడా ఇలాగే ఆడావు. కానీ అక్కడ అప్పుడు ఎవరూ లేరు. ఆ తర్వాత ఫీల్డింగ్ చూసుకోవాల్సింది. నువ్వు డీప్ థర్డ్ మేన్ వద్ద క్యాచ్ అయ్యావు. భారత్ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో నువ్వు ఆ షాట్ ఆడాల్సింది కాదు. పరిస్థితులను అర్థం చేసుకుని ఆడడం ముఖ్యం. ఇది నీ నేచురల్ గేమ్ అని చెప్పకు. ఐయామ్ సారీ, ఇది నీ నేచురల్ గేమ్ అస్సలు కాదు. నువ్వు ఎంచుకున్నది అత్యంత తెలివితక్కువ షాట్. అది నీ జట్టును మరింత దెబ్బతిసింది' అని గావస్కర్ అన్నాడు.
" stupid, stupid, stupid!" 😡
— ABC SPORT (@abcsport) December 28, 2024
🏏 safe to say sunny wasn't happy with rishabh pant after that shot.
read more: https://t.co/bEUlbXRNpm
💻📝 Live blog: https://t.co/YOMQ9DL7gm
🟢 Listen live: https://t.co/VP2GGbfgge #AUSvIND pic.twitter.com/Fe2hdpAtVl
అయితే పంత్ ఔటయ్యే సరికి భారత్ స్కోర్ 191 పరుగులు. అప్పటికి టీమ్ఇండియా ఫాలో ఆన్ నుంచి బయటపడాలంటే ఇంకా 84 రన్స్ కావాల్సి ఉంది. ఆ తర్వాత చెప్పుకోదగ్గ బ్యాటర్లు లేకపోవడం వల్ల గావస్కర్ అతడిపై ఫైర్ అయ్యాడు.
'నువ్వేం తప్పు చేశావు, నీకు ఈ డిమోషన్ ఏంటీ?'- రాహుల్‌పై కవ్వింపు చర్యలు
నితీశ్ ది సేవియర్- ఫాలో ఆన్ తప్పించిన తెలుగోడు- పుష్ప స్టైల్లో సెలబ్రేషన్స్