వైరల్: నదిలో కొట్టుకుపోయిన బొలెరో - బొలెరో వైరల్ వీడియో
🎬 Watch Now: Feature Video

యాస్ తుపాను ప్రభావం ఝార్ఖండ్‌లోని అనేక జిల్లాల్లో కనిపించింది. లతేహర్ జిల్లా ధార్ధారి నదిలో బొలెరో వాహనం చిక్కుకున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. తుపు హెస్లా గ్రామానికి సమీపంలో నదిని దాటుతుండగా ఒక్కసారిగా వరద పెరిగింది. స్థానికుల సహకారంతో వాహనంలో ఉన్న వారందరూ సురక్షితంగా ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఈ నదిపై వంతెన లేనందున వరదలు వచ్చిన ప్రతిసారీ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని గ్రామస్థులు తెలిపారు. ఇప్పటికైనా వంతెన నిర్మించాలని డిమాండ్ చేశారు.