ఎన్​సీపీ మహిళా ఎంపీతో స్టెప్పులేసి అలరించిన శివసేన ఎంపీ రౌత్​ - సంజయ్ రౌత్ కుమార్తె వివాహం

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Nov 29, 2021, 10:37 AM IST

రాజకీయాల్లో క్షణం తీరిక లేకుండా గడిపే శివసేన నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్​.. ఉత్సాహంగా స్టెప్పులేశారు. ముంబయిలోని ఓ సెవెన్ స్టార్ హోటల్ దీనికి వేదికైంది. ఆయన కుమార్తె వివాహాన్ని పురస్కరించుకుని నిర్వహించిన సంగీత్​లో ఈ దృశ్యం కనిపించింది. డ్యాన్స్ మధ్యలో.. ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలేనూ డ్యాన్స్ చేసేందుకు ఆహ్వానించారు రౌత్. ఆమెతో కలసి నృత్యం చేస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి. రౌత్ కుమార్తె పూర్వశి- హిచి మల్హర్ నర్వేకర్‌ల వివాహం సోమవారం జరగనుంది. మల్హర్ నర్వేకర్ ఠాణె జిల్లా కలెక్టర్ రాజేష్ నర్వేకర్ కుమారుడు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.