మహిళ వీరంగం.. పోలీసులపై చెప్పుతో దాడి - ఉత్తర్​ప్రదేశ్​ న్యూస్​

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : May 5, 2022, 9:37 PM IST

Updated : Feb 3, 2023, 8:23 PM IST

Woman Hit Policemen With Slippers: ఉత్తర్​ప్రదేశ్​ మేరఠ్​ జిల్లాలో ఓ మహిళ వీరంగం సృష్టించింది. స్కూటీపై రాంగ్​ రూట్లో ప్రయాణిస్తున్న ఆమెను పోలీసులు అడ్డుకున్నందుకు​ వాగ్వాదానికి దిగి వారిపై చెప్పుతో దాడి చేసింది. కొత్వాలి పోలీస్​ స్టేషన్​ పరిధిలో ఈ ఘటన జరిగింది. కుమార్తెతో కలిసి వెళ్తున్న మహిళ రాంగ్​ రూట్లో ప్రయాణిస్తోంది. అక్కడే ఉన్న పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయగా.. మహిళ ఆగ్రహంతో వారిపై దుర్భాషలాడింది. పోలీసులను చెప్పుతో కొట్టింది. అక్కడే ఉన్న పోలీసులు వీడియో తీశారు. వీడియో ఆధారంగా మహిళపై కేసు నమోదు చేసినట్లు నగర ఎస్పీ వినీత్​ భట్నాగర్​ తెలిపారు.
Last Updated : Feb 3, 2023, 8:23 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.