2 మామిడిపండ్లు చోరీ.. మైనర్లను కట్టేసి చితకబాదిన యజమాని - మామిడి కాయల దొంగతనంతో
🎬 Watch Now: Feature Video
మామిడి తోటలో రెండు మామిడిపండ్లు దొంగతనం చేశారని ఇద్దరు బాలురను కట్టేసి చితకబాదాడు ఓ యజమాని. ఈ సంఘటన బిహార్లోని మధుబనీ జిల్లాలో వెలుగుచూసింది. ఒకే తాడుతో ఇద్దరి చేతులు వెనక్కి కట్టి.. లాక్కెళుతూ మామిడి కొమ్మలతో కొడుతున్న దృశ్యాలు వైరల్గా మారాయి. బట్టలు విప్పించి చిన్నారుల శరీరంపై తేనెతుట్టెలను వేస్తూ తేనెటీగలతో కుట్టించే ప్రయత్నం చేశాడు. అక్కడే ఉన్న కొందరు మహిళలు బాలురను చూసి నవ్వుతూ ఎంజాయ్ చేశారు. జిల్లాలోని బాసుదేవపుర్ గ్రామంలో జరిగినట్లు సమాచారం అందిందని, వీడియో ఆధారంగా నిందితులను గుర్తించి చర్యలు తీసుకుంటామని లౌకహా స్టేషన్ ఎస్సై సంతోశ్ కుమార్ మండల్ తెలిపారు.
Last Updated : Feb 3, 2023, 8:23 PM IST