భారీగా కురుస్తున్న మంచు.. జాతీయ రహదారుల మూసివేత.. నీరు, విద్యుత్ సరఫరాకు అంతరాయం - హిమాచల్ ప్రదేశ్‌లో మంచు
🎬 Watch Now: Feature Video
హిమాచల్‌ప్రదేశ్‌లో భారీగా మంచు కురుస్తోంది. మంచు కారణంగా జాతీయ రహదారులు సహా 500 రోడ్లను మూసివేశారు. నీరు, విద్యుత్తు సరఫరాకు పలుచోట్ల అంతరాయం వాటిల్లింది. రోహ్‌తంగ్, అటల్ సొరంగం వంటిచోట్ల ఎకాఎకి 75 సెంటీమీటర్ల మంచు కురిసింది. హిమాచల్‌లో శుక్రవారం వరకు పలుచోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆ రాష్ట్రంలో అనేకచోట్ల మైనస్ డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
Last Updated : Feb 3, 2023, 8:39 PM IST