సైన్స్ ఎగ్జిబిషన్​లో​ పేలిన రాకెట్​ విద్యార్థులకు గాయాలు - కళాశాల సైన్స్ ఎగ్జిబిషన్​లో​ పేలుడు

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Dec 13, 2022, 9:51 AM IST

Updated : Feb 3, 2023, 8:35 PM IST

ఓ కళాశాలలో నిర్వహించిన సైన్స్ ఎగ్జిబిషన్​లో​ స్వల్ప పేలుడు సంభవించింది. ప్రదర్శనలో భాగంగా ఫిజిక్స్​ విద్యార్థులు చేసిన రాకెట్ ప్రయోగంలో లోపం తలెత్తి ఈ పేలుడు జరిగింది. ఈ ప్రమాదం ఝార్ఖండ్​ తూర్పు సింగ్‌భూమ్ జిల్లాలోని ఘట్‌శిలాలో జరిగింది. వాస్తవానికి ఈ ప్రయోగంలో రాకెట్​ పైకి వెళ్లిన అనంతరం పేలుడు జరగాలి. అయితే ప్రయోగం చేసే విద్యార్థి, రాకెట్ పైకి వెళ్లక ముందే పొరపాటున పేలుడు జరిగే బటన్ నొక్కాడు. దీంతో రాకెట్​ కిందే పేలింది. సోమవారం జరిగిన ఈ ఘటనలో 11 మంది విద్యార్థులు గాయపడ్డారు. వెంటనే విద్యార్థులను ఆసుపత్రికి తరలించారు ఉపాధ్యాయులు.
Last Updated : Feb 3, 2023, 8:35 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.