ETV Bharat / bharat

దేశ సైనికుల మృతదేహాలపైనే 2019 ఎన్నికల పోరు: సత్యపాల్ మాలిక్ - సత్యపాల్ మాలిక్ రాజకీయ జీవితం

Satyapal Malik on Pulwama Attack : కేంద్ర ప్రభుత్వంపై జమ్ముకశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ తీవ్ర విమర్శలు చేశారు. 2019లో జరిగిన లోక్​సభ ఎన్నికలు సైనికుల మృతదేహాలపై జరిగాయని అన్నారు. పుల్వామా దాడి సమయంలో ప్రధాని మోదీ.. జిమ్ కార్బెట్ నేషనల్ పార్కులో షూటింగ్​లో ఉన్నారని గుర్తుచేశారు.

satyapal malik on pulwama attack
satyapal malik on pulwama attack
author img

By

Published : May 22, 2023, 9:45 AM IST

Updated : May 22, 2023, 10:44 AM IST

Satyapal Malik on Pulwama Attack : పుల్వామా ఉగ్రదాడి ఘటనకు సంబంధించి కేంద్ర ప్రభుత్వంపై మరోసారి తీవ్ర విమర్శలు చేశారు జమ్ముకశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్​. 2019 లోక్​సభ ఎన్నికల పోరు.. దేశ సైనికుల మృతదేహాలపై జరిగిందని ఆయన వ్యాఖ్యానించారు. పుల్వామా దాడిపై విచారణ జరిగి ఉంటే అప్పటి హోం మంత్రి రాజ్​నాథ్ సింగ్ రాజీనామా చేయాల్సి వచ్చేదని అన్నారు. రాజస్థాన్​.. అల్వార్ జిల్లాలోని బన్సూర్​లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ​

"2019 లోక్‌సభ ఎన్నికల పోరు మన సైనికుల మృతదేహాలపై జరిగింది. పుల్వామా ఉగ్రదాడి ఘటపై ఎలాంటి దర్యాప్తు జరగలేదు. ఈ ఘటనపై విచారణ జరిగిఉంటే అప్పటి హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ రాజీనామా చేయాల్సి వచ్చేది. చాలా మంది అధికారులు జైలుకు వెళ్లేవారు. చాలా వివాదాస్పదం అయ్యేది. వ్యాపారవేత్త గౌతమ్​ అదానీ కేవలం మూడేళ్లలోనే సంపద పోగుచేశారు. వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వాన్ని మార్చాలి. ఒకవేళ మీరు మళ్లీ వారికి ఓటేస్తే భవిష్యత్తులో ఓటు వేసే అవకాశాన్నే కోల్పోతారు."
-సత్యపాల్ మాలిక్, జమ్ముకశ్మీర్ మాజీ గవర్నర్​

పుల్వామా ఉగ్రదాడి జరిగిన 2019, ఫిబ్రవరి 14న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. జిమ్‌ కార్బెట్‌ నేషనల్‌ పార్కులో షూటింగ్‌లో ఉన్నారని సత్యపాల్ మాలిక్ తెలిపారు. మోదీ.. నేషనల్‌ పార్కు నుంచి బయటకు రాగానే తాను ఫోన్ చేశానని.. మన పొరపాటు కారణంగా సైనికులు మరణించారని చెప్పానని అన్నారు. దీనికి జవాబుగా మోదీ.. తనను మౌనంగా ఉండాలని కోరారని సత్యపాల్ మాలిక్ పేర్కొన్నారు.

SatyaPal Malik CBI Raid : ఇటీవల బీమా కుంభకోణం కేసులో జమ్ముకశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్​ మాజీ సహాయకుడి ఇల్లు సహా దేశవ్యాప్తంగా తొమ్మిది ప్రాంతాల్లో సీబీఐ సోదాలు నిర్వహించింది. ఇదే కేసులో ఏప్రిల్ 28న సత్యపాల్​ మాలిక్ సీబీఐ ప్రశ్నించింది. మాలిక్ సహాయకుడిపై ఇంటిపై దాడులు జరిగిన కొద్ది రోజుల్లోనే కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడం గమనార్హం.

ఇదీ కేసు..
SatyaPal Malik Insurance Case : సత్యపాల్‌ మాలిక్‌ 2018లో జమ్ముకశ్మీర్‌ గవర్నర్‌గా ఉన్న సమయంలో.. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, వారి కుటుంబాల కోసం ఉద్దేశించిన వైద్య బీమా పథకంతోపాటు కిరు జలవిద్యుత్ ప్రాజెక్టులో సివిల్ వర్క్ కాంట్రాక్టుల విషయంలో అవినీతి జరిగిందని ఆరోపణలు వచ్చాయి. ఈ ఫైళ్లను క్లియర్‌ చేసేందుకు సత్యపాలిక్​ మాలిక్​కు​ రూ.300 కోట్ల లంచం ఇవ్వజూపారని సీబీఐ పేర్కొంది. వీటిపై గతేడాది ఏప్రిల్‌లో సీబీఐ వేర్వేరుగా కేసులు నమోదు చేసింది.

Satya Pal Malik Political Career : సత్యపాల్ మాలిక్​ జమ్ముకశ్మీర్ గవర్నర్‌గా ఉన్న సమయంలోనే ఆర్టికల్‌ 370 రద్దైంది. సత్యపాల్‌ మాలిక్‌ జమ్ముకశ్మీర్‌తో పాటు మేఘాలయా, గోవా గవర్నర్‌గానూ సేవలందించారు. జమ్ముకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370 రద్దు చేసి.. ఆ రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వం కశ్మీర్‌, లద్దాఖ్‌ అనే రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించిన సమయంలో సత్యపాల్‌ మాలిక్‌ గవర్నర్‌గా ఉన్నారు. ఆ చారిత్రక నిర్ణయం జరిగిన నెల రోజులకు ఆయన గోవా గవర్నర్‌గా బదిలీ అయ్యారు. అక్టోబర్‌ 2022 వరకు ఆయన మేఘాలయ గవర్నర్‌గా సేవలందించారు.

Last Updated : May 22, 2023, 10:44 AM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.