ETV Bharat / bharat

కుప్పకూలిన కోస్ట్​గార్డ్​ హెలికాప్టర్​- ముగ్గురు సిబ్బంది మృతి - COAST GUARD HELICAPTOR CRASHED

కుప్పకూలిన ఇండియన్ కోస్ట్​ గార్డ్​ హెలికాప్టర్​ ALH ధ్వవ్​ - ముగ్గురు సిబ్బంది మృతి

Indian Coast Guard Helicaptor Crashed
Indian Coast Guard Helicaptor Crashed (ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 5, 2025, 1:42 PM IST

Updated : Jan 5, 2025, 3:02 PM IST

Indian Coast Guard Helicaptor Crashed : ఇండియన్ కోస్ట్​గార్డ్​కు-ఐసీజీ చెందిన హెలికాప్టర్‌ ఒకటి గుజరాత్‌లోని పోర్​బందర్‌ తీరంలో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఇద్దరు పైలట్లు సహా ముగ్గురు సిబ్బంది మృతి చెందారు. కోస్ట్‌గార్డ్‌ గార్డ్‌ ఎయిర్‌ ఎన్‌క్లేవ్‌లో ఇది కూలిపోయినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఐసీజీ అధికారులు ప్రకటించారు.

ఈ హెలికాఫ్టర్‌ ప్రయాణం మొదలుపెట్టాక సాంకేతిక సమస్యలను ఎదుర్కొంది. ఆ తర్వాత కొద్దిసేపటికే అది కూలిపోయింది. దీనిపై కోస్టు గార్డు ఇప్పటికే దర్యాప్తు చేపట్టింది.

ఇప్పటికే ఏఎల్‌హెచ్‌(అడ్వాన్స్‌డ్ లైట్‌ హెలికాప్టర్‌) హెలికాప్టర్లలో కీలకమైన రక్షణ చర్యలకు హిందూస్థాన్‌ ఏరోనాటికల్‌ సంస్థ ఇప్పటికే చర్యలు చేపట్టింది. గతేడాది కూడా ఈ శ్రేణికి చెందిన హెలికాఫ్టర్లు ప్రమాదాలకు గురయ్యాయి. డిజైన్‌ సమస్యలు ఉండటం వల్ల చాలా చోట్ల వీటిని వాడటం లేదు.

గతేడాది మార్చి 8న నౌకాదళానికి చెందిన ఏఎల్‌హెచ్‌ ధ్రువ్‌ ముంబయి తీరంలో ప్రమాదానికి గురైంది. అందులోని ముగ్గురుని నేవీ పెట్రోలింగ్‌ ఎయిర్‌క్రాఫ్ట్​తో రక్షించారు. ఈ ఘటన తర్వాత ఏఎల్​హెచ్​ హెలికాప్టర్ల వినియోగాన్ని త్రివిధ దళాల్లో నిలిపివేశారు. కొన్నాళ్లకు సైన్యం వీటి సేవలను పునరుద్ధరించింది. అనంతరం కొన్నాళ్లకే మరో హెలికాప్టర్‌ కూలిపోయింది. అప్పుడు నాడు సాంకేతిక లోపం తలెత్తడం వల్ల జమ్ముకశ్మీర్‌లోని కిశ్త్‌వాడ్‌ జిల్లా అటవీ ప్రాంతంలో అత్యవసరంగా దించేందుకు ప్రయత్నిస్తుండగా ఈ హెలికాప్టర్ కుప్పకూలింది. ఆ ఘటనలో తెలంగాణకు చెందిన టెక్నికల్ నిపుణుడు పబ్బల్ల అనిల్‌(29) మృతి చెందారు.

Last Updated : Jan 5, 2025, 3:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.