ల్యాండ్ అవుతూ కూలిన హెలికాప్టర్- ఎన్నికల ప్రచారంలో సుష్మకు తప్పిన పెను ప్రమాదం - HELICOPTER CRASH - HELICOPTER CRASH
🎬 Watch Now: Feature Video


Published : May 3, 2024, 2:37 PM IST
Sushma Andhare Helicopter Accident : మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ జిల్లాలో శివసేన UBT నాయకురాలు సుష్మ అంధారేకు పెను ప్రమాదం తప్పింది. ఆమె ఎక్కబోయే హెలికాప్టర్ ల్యాండ్ అవుతుండగా కూలిపోయింది. శుక్రవారం ఉదయం 9.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరగింది. పైలట్ స్వల్ప గాయాలతో ప్రాణాలతో బయటపడ్డారు.
అసలేం జరిగిందంటే?
సుష్మ అంధారే గురువారం మహాద్లో ఎన్నికల ర్యాలీ నిర్వహించారు. శుక్రవారం బారామతిలో జరగనున్న మరో ర్యాలీకి ఆమె వెళ్లాల్సి ఉంది. తీవ్రమైన ఎండల కారణంగా రోడ్డు మార్గంలో వెళ్లలేక హెలికాప్టర్లో ప్రయాణించాలని అనుకున్నారు. అందుకు గాను హెలికాప్టర్‌ను రప్పించారు. మహాద్ మైదానంలో హెలికాప్టర్ ఎక్కేందుకు సుష్మ సిద్ధంగా ఉన్నారు. చాలా సేపు ఎదురుచూసినా హెలికాప్టర్ రాలేదు.
ఆ తర్వాత కొద్దిసేపటికే హెలికాప్టర్‌ను ల్యాండ్ చేసేందుకు రెండు రౌండ్లు వేశారు పైలట్. కానీ ప్రమాదవశాత్తు హెలికాప్టర్ ఒక్కసారిగా కూలిపోయింది. భారీ శబ్దం వచ్చింది. దీంతో స్థానికులంతా భయాందోళనకు గురయ్యారు.ఈ ఘటనపై అధికారులు విచారణ జరుపుతారని సుష్మ అంధారే తెలిపారు.