LIVE : నిజామాబాద్‌లో ఎంపీ అర్వింద్ ప్రెస్ మీట్ - MP Arvind Press Meet in nizamabad - MP ARVIND PRESS MEET IN NIZAMABAD
🎬 Watch Now: Feature Video
Published : May 10, 2024, 12:26 PM IST
|Updated : May 10, 2024, 12:32 PM IST
MP Arvind Live : బీజేపీ దేశ ఉన్నతి కోసం పని చేస్తుంటే, బీఆర్ఎస్, కాంగ్రెస్‌లు కుల రాజకీయాలు చేస్తున్నాయని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆరోపించారు. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శిస్తున్నారు. తెలంగాణ లో కాంగ్రెస్ రెండో స్థానానికే పరిమితమని, బీఆర్ఎస్ తెలంగాణలో ఎక్కడా డిపాజిట్లు దక్కవని అన్నారు. కాంగ్రెస్ అంటేనే స్కామ్‌లు అని విమర్శించారు. బ్రిటిష్ పాలకుల కంటే ఎక్కువ దేశాన్ని హస్తం పార్టీ దోచేసిందని ఆరోపించారు. అవినీతిపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు దెయ్యాలు వేదాలు వళ్లించినట్లుగా ఉన్నాయని ఎద్దేవా చేశారు. దేశంలో దోపిడీని ఆపేందుకు రాహుల్ గాంధీని విదేశాలకు పంపిస్తారా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలపై ప్రజలు ఆ పార్టీని నిలదీస్తున్నారని చెప్పారు. ప్రధాని మోదీ పాలనపై అవినీతి ఆరోపణలు అర్ధరహితమని అర్వింద్ వ్యాఖ్యానించారు. ఇచ్చిన మాట ప్రకారం నిజామాబాద్‌కు పసుపుబోర్డు తీసుకువచ్చానని తెలిపారు. రాష్ట్రం సహకరిస్తే జక్రాన్‌పల్లి ఎయిర్‌పోర్టు ఏడాదిలోపు తెరుచుకోవచ్చని అన్నారు. నిజామాబాద్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన అర్వింద్ ఈ పదేళ్లలో రాష్ట్రానికి, దేశానికి మోదీ సర్కార్ చేసిన అభివృద్ధిపై మాట్లాడుతున్నారు.
Last Updated : May 10, 2024, 12:32 PM IST