LIVE : నిజామాబాద్‌లో ఎంపీ అర్వింద్ మీడియా సమావేశం - mp arvind live - MP ARVIND LIVE
🎬 Watch Now: Feature Video


Published : May 1, 2024, 4:25 PM IST
|Updated : May 1, 2024, 4:36 PM IST
MP Arvind Live : బీజేపీ దేశ ఉన్నతి కోసం పని చేస్తుంటే, బీఆర్ఎస్, కాంగ్రెస్‌లు కుల రాజకీయాలు చేస్తున్నాయని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆరోపించారు. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శిస్తున్నారు. తెలంగాణ లో కాంగ్రెస్ రెండో స్థానానికే పరిమితమని, బీఆర్ఎస్ తెలంగాణలో ఎక్కడా డిపాజిట్లు దక్కవని అన్నారు. కాంగ్రెస్ అంటేనే స్కామ్‌లు అని విమర్శించారు. బ్రిటిష్ పాలకుల కంటే ఎక్కువ దేశాన్ని హస్తం పార్టీ దోచేసిందని ఆరోపించారు. అవినీతిపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు దెయ్యాలు వేదాలు వళ్లించినట్లుగా ఉన్నాయని ఎద్దేవా చేశారు. దేశంలో దోపిడీని ఆపేందుకు రాహుల్ గాంధీని విదేశాలకు పంపిస్తారా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలపై ప్రజలు ఆ పార్టీని నిలదీస్తున్నారని చెప్పారు. ప్రధాని మోదీ పాలనపై అవినీతి ఆరోపణలు అర్ధరహితమని అర్వింద్ వ్యాఖ్యానించారు. గల్ఫ్ కార్మికులతో కాంగ్రెస్ రాజకీయం చేస్తోందని విమర్శించారు. గల్ఫ్ బోర్డు ఎన్నికల స్టంట్ అని, ఇప్పుడు వారు గుర్తొచ్చారా అని ఆయన ప్రశ్నించారు. తాజాగా ఈరోజు నిజామాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అర్వింద్ పాల్గొన్నారు.
Last Updated : May 1, 2024, 4:36 PM IST