లక్కీ ఉమెన్- రైలు పట్టాల మధ్య ఉండిపోయిన మహిళ- సేఫ్గా బయటకు! - goods train runs over women
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/29-02-2024/640-480-20871626-thumbnail-16x9-train.jpg)
![ETV Bharat Telugu Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telugu-1716536082.jpeg)
Published : Feb 29, 2024, 5:16 PM IST
Goods Train Runs Over Woman In Bihar : ఆగి ఉన్న గూడ్స్ రైలు కింద నుంచి పట్టాలు దాటేందుకు ప్రయత్నించిన ఓ మహిళ ట్రాక్ మధ్య ఇరుక్కుపోయింది. అనంతరం అకస్మాత్తుగా రైలు కదిలింది. కానీ చాకచక్యంగా వ్యవహరించి పెను ప్రమాదం నుంచి బయటపడింది. ఈ ఘటన బిహార్లోని బత్నాహా రైల్వే స్టేషన్లో జరిగింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్గా మారింది.
ఇదీ జరిగింది
అరారియాలోని బత్నాహాకు చెందిన కనకలతా దేవి అనే మహిళ స్థానికంగా ఉన్న రైల్వే స్టేషన్లో లైన్ నంబర్ 5పై ఆగిఉన్న గూడ్స్ రైలు కింద నుంచి పట్టాలు దాటేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలోనే రైలు కదిలింది. దీంతో అక్కడ ఉన్న ప్రజలు ఆమెను వంగమని సూచించారు. వెంటనే అప్రమత్తమైన మహిళ రైలు వెళ్లేంతవరకు అక్కడే పడుకుని ప్రాణాలు కాపాడుకుంది. మహిళ ప్రాణాలతో బయటపడటం వల్ల అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఆ మహిళ బావ, కుమారుడు ఇటీవలే రోడ్డు ప్రమాదంలో మరణించారని ఆమెను దేవుడే రక్షించారని స్థానిక ప్రజలు చెబుతున్నారు. ప్రయాణీకులు ట్రాక్ల వద్ద జాగ్రత్తగా ఉండాలని రైల్వే స్టేషన్ సూపరింటెండెంట్ రాహుల్ కుమార్ కోరారు.