LIVE : మహారాష్ట్ర, ఝార్ఖండ్ ఎన్నికలు షెడ్యూల్ ప్రకటన - ప్రత్యక్షప్రసారం - EC ELECTIONS NOTIFICATION LIVE
🎬 Watch Now: Feature Video
Published : Oct 15, 2024, 3:35 PM IST
|Updated : Oct 15, 2024, 4:26 PM IST
EC To Announce Maharashtra, Jharkhand Election Notification LIVE : మహారాష్ట్ర, ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం మధ్యాహ్నం3.30 గంటలకు ప్రకటించనుంది. వీటితోపాటు 3లోక్‌సభ స్థానాలకు, 47అసెంబ్లీ స్థానాలకు కూడా ఉపఎన్నికల షెడ్యుల్‌ను ప్రకటించే అవకాశం ఉంది. మహారాష్ట్ర అసెంబ్లీ పదవీ కాలం నవంబరు 26తో ముగియనుంది. ఇక్కడ బీజేపీ, ఎన్సీపీ (అజిత్ పవార్ వర్గం), శివసేన( శిందే వర్గం) కలిసి మహాయుతిగా బరిలోకి దిగుతున్నాయి. కాంగ్రెస్, ఎన్సీపీ (శరద్ పవార్), శివసేన(ఉద్ధవ్ వర్గం) కలిసి మహావికాస్ అఘాడీగా పోటీ చేస్తున్నాయి. మరోవైపు ఝార్ఖండ్ అసెంబ్లీ పదవీ కాలం వచ్చే ఏడాది జనవరి5తో ముగియనుంది. అక్కడ బీజేపీ, దాని మిత్రపక్షాలకు, జేఎంఎం కూటమికి మధ్య ప్రధానంగా పోటీ ఉంటుంది. కాంగ్రెస్ అగ్రనేత వయనాడ్, రాయ్‌బరేలీ రెండూ చోట్ల విజయం సాధించారు. దీనితో వయనాడ్ స్థానానికి రాజీనామా చేశారు. కనుక అక్కడ ఉపఎన్నిక అనివార్యం అయ్యింది.
Last Updated : Oct 15, 2024, 4:26 PM IST