LIVE : బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు మీడియా సమావేశం - Raghunandan Rao Live - RAGHUNANDAN RAO LIVE
🎬 Watch Now: Feature Video


Published : Jun 5, 2024, 4:28 PM IST
BJP MP Candidate Raghunandan Rao Live : మెదక్ ఎంపీ స్థానంలో డబ్బులు పంచుతుంటే పట్టించుకోలేదని ఆ లోక్‌సభ స్థానంలో గెలుపొందిన అభ్యర్థి రఘునందన్ రావు అన్నారు. హైదరాబాద్‌లోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఆయన మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం టడబ్బుల పంపిణీపై ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదు. ఎన్నికల వేళ వెంకట్రామిరెడ్డి విచ్చలవిడిగా డబ్బులు పంచారు. వెంకట్రామిరెడ్డి డబ్బులు పంచితే ఎందుకు అరెస్టు చేయలేదు.మెదక్ పార్లమెంటు స్థానంలో భారాస రూ.200 కోట్లు పంచింది. ఆరుగురు ఎమ్మెల్యేలు దగ్గరుండి డబ్బులు పంచారు. మెదక్‌లో సొంత పార్టీని రేవంత్ రెడ్డి గెలిపించుకోలేకపోయారు. బీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి మారాయని ఆరోపిస్తున్నారు. నాకు హరీశ్‌రావు ఓట్లు వేయిస్తే ఏ ప్రమాణానికైనా సిద్ధం. కేసీఆర్ ఓడించి మీకు గెలిపించారా. బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ ఓట్లు వేశారా. 8 చోట్ల మీరు గెలిచారు, మిగతా 8 చోట్ల మీకు ఓట్లు మారాయా? అని మాట్లాడుతున్నారు. కాంగ్రెస్‌పై విమర్శలు చేస్తున్నారు.