టుస్సాడ్ మ్యూజియంలో బాబా రామ్‌దేవ్ మైనపు విగ్రహం- యోగా గురువుకు అరుదైన గౌరవం - madame tussauds baba ramdev statue
🎬 Watch Now: Feature Video

Published : Jan 30, 2024, 5:26 PM IST
Baba Ramdev Statue In Tussauds : యోగాగురు బాబా రామ్‌దేవ్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఆయన మైనపు విగ్రహాన్ని న్యూయర్క్‌లోని టుస్సాడ్ మ్యాజియంలో ఆవిష్కరించనున్నారు. ఈ మేరకు దిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో వృక్షాసన్ యోగాపోజ్తో ఉన్న తన మైనపు బొమ్మను తానే ఆవిష్కరించుకున్నారు. ఈ విగ్రహాన్ని న్యూయర్క్ టైమ్స్ స్క్వేర్‌లోని టుస్సాడ్ మ్యూజియంలో పెట్టనున్నారు. 'యోగా, ఆరోగ్యం విభాగాల్లో బాబా రామ్‌దేవ్ విశేషమైన సేవలు చేశారు. అందువల్ల ఆయనకు ఇచ్చే గౌరవంగా దీనిని భావిస్తున్నాము. ఆయన విగ్రహం మ్యూజియంలో ఉండటం వల్ల ఇక్కడకు వచ్చే ఎంతో మంది సందర్శకులకు స్వీయ అభివృద్ధి, సంపూర్ణ శ్రేయస్సును ప్రేరేపిస్తుందని భావిస్తున్నాము' అని టుస్సాడ్ మ్యూజియం అధికార ప్రతినిధి టియాగో మొగొడౌరో తెలిపారు. ఆ మ్యూజియంలో విగ్రహం ఏర్పాటు కానున్న భారత్‌కు చెందిన తొలిసాధువుగా బాబా రామ్‌దేవ్ నిలవనున్నారు. తన మైనపు బొమ్మ తయారీ కోసం బాబా రామ్‌దేవ్ 2018లో లండన్‌లోని టుస్సాడ్ మ్యూజియానికి చెందిన 20మంది సభ్యుల బృందానికి ఫొటోతోపాటు కొలతలు ఇచ్చినట్లు సంబంధితవర్గాలు వెల్లడించాయి.