'వద్దు బాబోయ్ వద్దు' - పంత్‌ను ఆపేందుకు సర్ఫరాజ్ ఫన్నీ స్టంట్ - నవ్వులే నవ్వులు - SARFARAZ HILARIOUSLY REACTION
న్యూజిలాండ్‌తో జరుగుతున్న మొదటి టెస్టులో పంత్‌ను రెండో పరుగు చేయవద్దని వారిస్తూ సర్ఫరాజ్ ఖాన్ ఫన్నీ రియాక్షన్!
Published : Oct 19, 2024, 12:48 PM IST
|Updated : Oct 19, 2024, 2:49 PM IST
IND VS NZ 1st Test Sarfaraz Funny Reaction pant : న్యూజిలాండ్‌తో జరుగుతున్న మొదటి టెస్టులో టీమ్ ఇండియా దీటుగా సమాధానం ఇస్తూ ఆడుతోంది. 356 పరుగుల భారీ లోటుతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన టీమ్‌ఇండియా మంచి ప్రదర్శన చేస్తూ ముందుకెళ్తోంది. సర్ఫరాజ్ ఖాన్ కెరీర్‌లో తొలి సెంచరీ బాదేసి అందరి దృష్టి ఆకర్షించాడు. రిషభ్ పంత్ హాఫ్ సెంచరీ బాదేసి దూసుకెళ్లాడు. వీరిద్దరు కలిసి సెంచరీ భాగస్వామ్యం నిర్మించడం విశేషం.
అయితే ఇన్నింగ్స్‌లోని 56వ ఓవర్‌లో ఓ ఫన్నీ ఇన్సిండెంట్ చోటు చేసుకోవడం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పంత్‌ను రనౌట్ చేసే అవకాశాన్ని న్యూజిలాండ్ ఫీల్డర్లకు చేజారింది. అదే సమయంలో పంత్‌ను రెండో పరుగు చేయవద్దని వారిస్తూ సర్ఫరాజ్ ఖాన్ ఇచ్చిన రియాక్షన్ నెట్టింట్లో ఫుల్ ట్రెండ్ అవుతూ నవ్వులు పూయిస్తోంది. 'వద్దు బాబోయ్ వద్దు' అన్నట్లుగా సర్ఫరాజ్ టెన్షన్‌తో చేసిన జంపింగ్ ఫీట్ కడుపుబ్బా నవ్వించింది. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఫ్యాన్స్ తెగ కామెంట్లు చేస్తున్నారు. సర్ఫరాజ్ ఏదో చెబుతున్నాడు చూడు రిషభ్ భాయ్ అని ఫ్యాన్స్ కామెంట్లు చేశారు.
🤣🤣 https://t.co/ThCCxMp1yD pic.twitter.com/ymjEvBO0b4
— mon (@4sacinom) October 19, 2024
సర్ఫరాజ్ సెంచరీ సంబరాలపై రోహిత్(Sarfaraz Century Rohith) - సర్ఫరాజ్ తన కెరీర్‌లో తొలి సెంచరీ సాధించిన తర్వాత సంబరాలు చేసుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో కూడా వైరల్‌గా మారింది. మైదానమంతా పరిగెత్తుతూ సర్ఫరాజ్ తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు. భారత్ కష్టాల్లో ఉన్నప్పుడు సెంచరీ బాది ఆదుకున్నాడు. దీంతో అతడిని జట్టు సహచరులంతా చప్పట్లతో ప్రశంసించారు. అప్పుడు రోహిత్ శర్మ నవ్వుతున్న వీడియో బాగా ట్రెండ్ అయింది.
అతడు మియాందాద్ వెర్షన్ 2024(2024 Version Of Javed Miandad) - సర్ఫరాజ్ ఇన్నింగ్స్‌ను ఉద్దేశించి భారత మాజీ క్రికెటర్, కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ కామెంట్స్ చేశాడు. "సర్ఫరాజ్ అద్భుత ప్రదర్శన చేశాడు. నాకు అతడిని చూస్తుంటే 1980ల్లో జావెద్ మియాందాద్ గుర్తుకొచ్చాడు. సర్ఫరాజ్ 2024 వెర్షన్ ఆఫ్ జావెద్ మియాందాద్. స్పిన్‌తో పాటు పేసర్లను బాగా ఎదుర్కొంటున్నాడు" అని అన్నాడు.