ETV Bharat / business

పూచీకత్తు లేకుండా రూ.20కోట్ల వరకు బిజినెస్ లోన్​ - ఈ​ స్కీమ్​ గురించి మీకు తెలుసా? - BUSINESS LOAN SCHEMES FOR WOMEN

మహిళా వ్యాపారవేత్తల కోసం ఉన్న టాప్-5 బిజినెస్ లోన్​ స్కీమ్స్ ఇవే!

business women
business women (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 11, 2025, 10:54 AM IST

Business Loan Schemes For Women : మన దేశంలో వ్యాపారం చేసే మహిళల కోసం కొన్ని వ్యాపార రుణ పథకాలు అందుబాటులో ఉన్నాయి. వాటి ద్వారా మహిళలు తమ వ్యాపారాల కోసం రుణాలను పొందొచ్చు. ఆర్థిక వృద్ధిని అందుకోవచ్చు. వనితలను వ్యాపార రంగంలో సశక్తులుగా తీర్చిదిద్దడమే ఈ పథకాల ప్రధాన లక్ష్యం. అందుకే ఈ కథనంలో టాప్-5 బిజినెస్ లోన్ స్కీంల గురించి తెలుసుకుందాం.

వ్యక్తిగత రుణాలు Vs వ్యాపార రుణాలు
వ్యక్తిగత రుణాలకు, వ్యాపార రుణాలకు చాలా తేడా ఉంది. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, ఆన్‌లైన్ సంస్థల నుంచి వ్యక్తిగత రుణాలను పొందొచ్చు. దరఖాస్తు చేసిన వ్యక్తి ఆదాయం, క్రెడిట్ స్కోర్, ఇతర అంశాల ఆధారంగా పర్సనల్ లోన్స్‌ను మంజూరు చేస్తారు. వ్యక్తిగత రుణాలకు పూచీకత్తు కావాలి. ఈ రుణాల ద్వారా పొందే నిధులతో మనకు ఇప్పటికే ఉన్న అప్పులను తీర్చేయొచ్చు. వైద్య వ్యయాల కోసం ఆ డబ్బును వాడుకోవచ్చు. ఇంటి పునర్నిర్మాణ పనుల కోసం ఆ నిధులను వినియోగించవచ్చు. వాటితో ఇంట్లో వినియోగించే ఉపకరణాలను కొనేయొచ్చు. వ్యాపార రుణం ద్వారా వచ్చే డబ్బును కేవలం వ్యాపారం కోసమే వెచ్చించాలి. వ్యాపార విస్తరణ, యంత్రాల కొనుగోలు, ముడిసరుకుల కొనుగోలు, వర్కింగ్ క్యాపిటల్, నిర్వహణ వ్యయాలకు రుణం డబ్బులను కేటాయించవచ్చు.

మహిళల కోసం ఉన్న టాప్ -5 బిజినెస్​ లోన్​ స్కీమ్స్​ ఇవే!

  • ముద్రా యోజన
  • స్టాండప్ ఇండియా ప్రోగ్రాం
  • మహిళా కాయిర్ యోజన
  • ఉద్యమ్ శక్తి పోర్టల్
  • క్రెడిట్ గ్యారెంటీ ఫండ్ ట్రస్ట్ ఫర్ మైక్రో అండ్ స్మాల్ ఎంటర్‌ప్రైజెస్

1. ముద్రా యోజన : సూక్ష్మ, చిన్నతరహా వ్యాపారాలు చేసే మహిళలకు ముద్రా యోజన రుణాలను మంజూరు చేస్తారు. మహిళలు యజమానులుగా ఉన్న సంస్థలకు పూచీకత్తు లేకుండానే రూ.10 లక్షల దాకా రుణాన్ని ఇస్తారు. దీనిపై వడ్డీ చాలా తక్కువగా ఉంటుంది. ఫలితంగా వ్యాపార విస్తరణ చేసుకుంటూ, రుణాన్ని సులభంగా తీర్చేయొచ్చు.

2. స్టాండప్ ఇండియా ప్రోగ్రామ్ : స్వయం ఉపాధి పొందే మహిళలకు స్టాండప్ ఇండియా ప్రోగ్రామ్ ద్వారా రూ.10 లక్షల నుంచి రూ.1 కోటి దాకా రుణాలను మంజూరు చేస్తారు. ఈ రుణాల మంజూరులో అణగారిన వర్గాలకు చెందిన మహిళలకు ప్రాధాన్యత ఉంటుంది. ఒక్కో బ్యాంకు బ్రాంచీ పరిధిలో కనీసం ఒక ఎస్సీ లేదా ఎస్టీ వర్గానికి చెందిన మహిళా వ్యాపారికి ఈ రుణాన్ని ఇస్తుంటారు. గ్రీన్ ఫీల్డ్ వ్యాపారాల్లో ట్రేడింగ్, తయారీతో పాటు సేవా రంగాల్లో పనిచేసే మహిళా వ్యాపారులు స్టాండప్ ఇండియా ప్రోగ్రామ్ ద్వారా లబ్ధి పొందొచ్చు.

3. మహిళా కాయిర్ యోజన : కొబ్బరి పీచు పరిశ్రమతో ముడిపడిన వ్యాపారాలు చేస్తున్న మహిళల సాధికారత కోసం మహిళా కాయిర్ యోజనను అమలు చేస్తున్నారు. ఆయా రంగాల్లోని మహిళా వ్యాపారులకు నైపుణ్య శిక్షణ అందిస్తున్నారు. రాయితీపై స్పిన్నింగ్ యంత్రాలు, పరికరాలను సమకూరుస్తున్నారు. వాటిపై దాదాపు 75 శాతం దాకా రాయితీని ఇస్తున్నారు. ప్రాజెక్టు వ్యయంలో దాదాపు 25 శాతం దాకా మార్జిన్ మనీ సబ్సిడీని ఆఫర్ చేస్తున్నారు.

4. ఉద్యమ్ శక్తి : కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ) శాఖ ఆధ్వర్యంలో ఉద్యమ్ శక్తి పథకాన్ని అమలు చేస్తున్నారు. దీని ద్వారా మహిళా వ్యాపారులకు రూ.25 లక్షల దాకా రుణాలను మంజూరు చేస్తుంటారు. సేవారంగ ఆధారిత పరిశ్రమలకు రూ.10 లక్షల దాకా రుణాలు ఇస్తారు. ఇందులో భాగంగా వారికి వివిధ వ్యాపార మార్కెట్లను పరిచయం చేస్తారు. శిక్షణ అందిస్తారు. మెంటార్‌షిప్‌ కోసం ఏర్పాట్లు చేస్తారు. వ్యాపార అవసరాల కోసం ఇంక్యుబేషన్ సెంటర్ల సహాయాన్ని పొందే అవకాశాన్ని కల్పిస్తారు. వ్యాపార ప్రణాళికను తయారు చేసుకోవడంలో సలహాలు, సూచనలను అందిస్తారు.

5. క్రెడిట్ గ్యారెంటీ ఫండ్ ట్రస్ట్ ఫర్ మైక్రో అండ్ స్మాల్ ఎంటర్‌ప్రైజెస్ : భారతదేశ చిన్న పరిశ్రమల అభివృద్ధి బ్యాంకు (SIDBI), కేంద్ర ఎంఎస్‌ఎంఈ శాఖలు సంయుక్తంగా ఒక రుణ స్కీంను అమలు చేస్తున్నాయి. అదే ‘‘క్రెడిట్ గ్యారెంటీ ఫండ్ ట్రస్ట్ ఫర్ మైక్రో అండ్ స్మాల్ ఎంటర్‌ప్రైజెస్’’. సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలకు ఆర్థికంగా దన్నుగా నిలవడం ఈ స్కీం లక్ష్యం. మహిళా వ్యాపారులు దీనితో ప్రయోజనం పొందొచ్చు. దీని ద్వారా గరిష్ఠంగా రూ.20 కోట్ల దాకా రుణాన్ని మంజూరు చేస్తారు. ఎంపిక చేసిన ప్రాజెక్టులకు మాత్రమే ఈ రుణం దక్కుతుంది. లోన్ మంజూరుకు పూచీకత్తులు కానీ, థర్డ్ పార్టీ గ్యారంటీలు కానీ అక్కర్లేదు.

మీ పిల్లల బంగారు భవిష్యత్ కోసం ఇన్వెస్ట్ చేయాలా? మంచి రాబడిని ఇచ్చే టాప్‌-5 స్కీమ్స్ ఇవే!

MMSC Vs SSY : సుకన్య సమృద్ధి యోజన Vs మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికెట్​.. ఏది బెస్ట్ ఆప్షన్​?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.