Rahul Gandhi Telangana Tour : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వరంగల్ పర్యటన రద్దైంది. సాయంత్రం వరంగల్ రావాల్సిన ఉన్న రాహుల్ గాంధీ, పార్లమెంటు సమావేశాల కారణంగా పర్యటనను రద్దు చేసుకున్నారు.
అసలేం జరిగింది : ఇవాళ రాహుల్ గాంధీ హైదరాబాద్, వరంగల్ పర్యటనకు రావాల్సింది. మధ్యాహ్నం 2.45 గంటలకు దిల్లీ నుంచి సాయంత్రం 5 గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకోవాల్సింది. అక్కడ నుంచి సాయంత్రం 5.15 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్‌లో బయలుదేరి సాయంత్రం 6 గంటలకు వరంగల్ చేరుకోవాల్సింది. రాహుల్ గాంధీతో పాటు సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ నేడు వరంగల్ వెళ్లాల్సింది.
రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి దీపాదాస్ మున్షీ కూడా రాహుల్ గాంధీతో సమావేశం అయ్యే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు చెప్పాయి. వరంగల్‌లో దాదాపు రెండు గంటల పాటు రాహుల్ గాంధీ ఉంటారని ఉంటారని అనుకున్నారు. రాత్రి 7.45 గంటలకు వరంగల్‌లో తమిళనాడు ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌లో బయలుదేరి చెన్నై బయలుదేరి వెళ్లాల్సింది.
బుధవారం ఉదయం 8.05 గంటలకు చెన్నైకి చేరుకోవాల్సిన రాహుల్ గాంధీ బృందం, ఉదయం 10.50 గంటలకు చెన్నై నుంచి దిల్లీ బయలు దేరి వెళ్లాల్సింది. ఈక్రమంలో రాహుల్ గాంధీ వరంగల్ పర్యటనలో రెండు గంటల పాటు ఉండటంతో సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్, దీపాదాస్ మున్షీలు రాహుల్‌తో ప్రత్యేకంగా సమావేశం అవుతారని అనుకున్నారు. స్థానిక నాయకులతో కూడా రాహుల్ గాంధీ సమావేశమయ్యే అవకాశం ఉన్నట్లు పీసీసీ వర్గాలు చెప్పాయి. కానీ ఇప్పుడు సడెన్‌గా రాహుల్ గాంధీ పర్యటన రద్దు అవ్వడంతో కాంగ్రెస్ శ్రేణులు నిరాశ చెందారు. రాహుల్ గాంధీ వస్తున్నారని వరంగల్‌లో ఏర్పాట్లు అన్ని పూర్తి చేశారు.
రాష్ట్రంలోని వయోజనులకన్నా ఓటర్ల సంఖ్యే ఎక్కువ- ఎలా సాధ్యం?: రాహుల్ గాంధీ