ETV Bharat / sports

యూఎస్​లో అరుదైన గౌరవం - 'బెస్ట్ జావెలిన్‌ త్రోయర్​ ఆఫ్ 2024'​గా నీరజ్! - NEERAJ CHOPRA US MAGAZINE

యూఎస్​లో అరుదైన గౌరవం - మ్యాగజైన్ కవర్​పై నీరజ్ పేరు - బెస్ట్ జావెలిన్‌ త్రో ప్లేయర్​గా ఎంపిక

NEERAJ CHOPRA US MAGAZINE
Neeraj Chopra (Associated Press)
author img

By ETV Bharat Sports Team

Published : Jan 11, 2025, 7:45 AM IST

Neeraj Chopra US Magazine : భారత స్టార్‌ జావెలిన్‌ త్రో అథ్లెట్‌ నీరజ్‌ చోప్రా తాజాగా ఓ అరుదైన గౌరవం దక్కింది. ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన ప్రముఖ అమెరికా మ్యాగజైన్‌ 'ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌' 2024కు గాను బెస్ట్ జావెలిన్‌ త్రో అథ్లెట్‌గా నీరజ్‌ పేరును ఎంపిక చేసింది. ఇక నీరజ్​కు ఈ ప్రతిష్ఠాత్మక గుర్తింపు లభించినందుకు క్రీడాభిమానులు ఎంతో ఆనందిస్తున్నారు. సోషల్ మీడియా వేదికరగా అతడికి కంగ్రాజ్యూలేషన్స్ చెప్తున్నారు.

వరుసగా అతడు రెండో ఏడాది ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్‌గా నిలిచి చరిత్రకెక్కాడు. గతేడాది పారిస్‌ ఒలింపిక్స్‌లో సిల్వర్​ మెడల్ సాధించిన ఈ 27 ఏళ్ల స్టార్ అథ్లెట్, ఈ మ్యాగజైన్‌ ప్రచురించిన ర్యాంకింగ్స్‌లో రెండుసార్లు ప్రపంచ ఛాంపియన్‌ అండర్సన్‌ పీటర్స్‌ (గ్రెనెడా)ను వెనక్కినెట్టి అగ్రస్థానం దక్కించుకున్నాడు. 2023లోనూ అతనే మొదటి స్థానం సొంతం చేసుకున్నాడు. నిరుడు డైమండ్‌ లీగ్‌లో దోహా, లాసానె, బ్రసెల్స్‌ పోటీల్లో నీరజ్‌ రెండో స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. పావో నూర్మి క్రీడల్లో ఛాంపియన్‌గా నిలిచాడు.

"అగ్రస్థానం కోసం గత నంబర్‌వన్‌ నీరజ్, 2022 విజేత అండర్సన్‌ మధ్య తేడా స్పష్టంగా చెప్పలేం. డైమండ్‌ లీగ్‌లో నీరజ్‌ ఛాంపియన్‌గా నిలవలేదు. కానీ ఓవరాల్‌గా 3-2తో అండర్సన్‌ను వెనక్కినెట్టాడు. అండర్సన్‌ డైమండ్‌ లీగ్‌ మూడు అంచె పోటీల్లో విజేతగా నిలిచాడు. కానీ పారిస్‌ ఒలింపిక్స్‌లో మెరుగైన ప్రదర్శన కారణంగా నీరజ్‌ ముందున్నాడు. మరో టోర్నీలో మాత్రమే పోటీపడి నాలుగో స్థానంలో నిలిచిన ఒలింపిక్‌ పసిడి విజేతను ఏం చేస్తాం? అందుకే అర్షద్‌ నదీమ్‌ అయిదో స్థానం కంటే మెరుగైన ర్యాంకు సాధించలేకపోయాడు" అని మేగజైన్‌లో రాసుకొచ్చారు. పారిస్‌ ఒలింపిక్స్‌లో నదీమ్‌ పసిడి, అండర్సన్‌ కాంస్యం గెలిచిన సంగతి తెలిసిందే. నిరుడు ఒలింపిక్స్‌ కాకుండా నదీమ్‌ పారిస్‌ డైమండ్‌ లీగ్‌ అంచెలో మాత్రమే పోటీపడి నాలుగో స్థానంలో నిలిచాడు.

భారత స్టార్‌ జావెలిన్‌ త్రోయర్ నీరజ్‌ చోప్రా రెండు ఒలింపిక్ పతకాలను దేశానికి అందించాడు. నీరజ్ దేశంలో ఉన్న అత్యంత సంపన్న అథ్లెట్లలో మొదటిస్థానంలో నిలిచాడు. మార్గెట్ వర్గాల సమాచారం మేరకు 2024 నాటికి నీరజ్ ఆస్తి విలువ 4.5 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.38 కోట్లు)గా అంచనా. అలాగే మ్యాచ్ ఫీజు, బ్రాండ్ ఎండార్స్‌ మెంట్​ల ద్వారా నెలకు రూ.30 లక్షలకు పైగా సంపాదిస్తున్నాడు నీరజ్. దాదాపుగా ఈ ఆదాయమే నీరజ్​కు ఏటా రూ.4 కోట్లకు వరకు వస్తుందని అంచనా.

కొత్త కోచ్ పేరు ప్రకటించిన నీరజ్ - ఆ లెజెండరీ అథ్లెట్ దగ్గర శిక్షణ

కపిల్ దేవ్ టు నీరజ్ చోప్రా - ఈ ప్లేయర్లు ఆర్మీ ఆఫీసర్లు కూడా! - Cricketers In Army

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.