Ravindra Jadeja Retirement : టీమ్ఇండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఇంటర్నేషనల్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించనున్నాడా? అంటే ఔను అనే సమాధానం వినిపిస్తోంది. తాను షేర్ చేసిన ఓ పోస్ట్ వల్ల జడ్డూ క్రికెట్‌కు గుడ్ బై చెప్పనున్నాడా? అంటు చర్చ మొదలైంది. అటు ఫ్యాన్స్, నెటిజన్లు కూడా తన పోస్ట్‌కు అర్థం ఇదే అని, అతడు ఇలా క్లూ ఇస్తున్నాడని కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇది క్రీడావర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. మరి జడ్డూ షేర్ చేసిన పోస్ట్ ఏంటంటే?
జడేజా తన టెస్టు జెర్సీ ఫొటోను ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేశాడు. అయితే సోషల్ మీడియాలో జడ్డూ ఎప్పుడూ యాక్టీవ్‌గానే ఉంటాడు. కానీ, ఎన్నడూ లేని విధంగా తొలిసారి తన జెర్సీ ఫొటోను సోషల్ మీడియోలో షేర్ చేయడం వల్ల ఈ ఊహాగానాలకు బలం చేకూరింది. ఇప్పటికే అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికిన జడ్డూ, త్వరలోనే టెస్టు, వన్డే ఫార్మాట్లకు కూడా రిటైర్మెంట్కూ సిద్ధమయ్యాడని, నెటిజన్లు అంటున్నారు. కానీ, జడ్డూ ఆ పోస్ట్ ఎందుకు షేర్ చేశాడో మాత్రం తెలియదు.
కాగా, ఇటీవల ముగిసిన ఆసీస్ పర్యటనలో జడేజా అనుకున్న స్థాయిలో రాణించలేకపోయాడు. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ రెండింట్లోనూ ఘోరంగా విఫలమయ్యాడు. ఈ సిరీస్‌లో మూడు మ్యాచ్‌లు ఆడిన జడేజా 135 పరుగులు చేసి, 4 వికెట్లే పడగొట్టాడు. దీంతో అతడి టెస్టు రిటైర్మెంట్కు సమయమైందని పలువురు కామెంట్ చేస్తున్నారు.
అందులో నో ఛాన్స్!
ఇంగ్లాండ్ ఈ నెలలో భారత్ పర్యటనకు రానుంది. ఈ పర్యటనలో 5టీ20, 3 వన్డే మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఫిబ్రవరిలో వన్డే సిరీస్ ఉండనుంది. ఈ సిరీస్‌కు బీసీసీఐ జట్టును ఎంపికచేసే సన్నాహాల్లో ఉంది. అయితే ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్‌లో జడేజాకు చోటు దక్కడం కష్టం అని వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో జడేజా రిటైర్మెంట్ గురించి ఆలోచిస్తున్నాడని సమాచారం.
2009లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన జడేజా మూడు ఫార్మాట్లలో టీమ్ఇండియాకు కీలకమైన ఆల్‌రౌండర్‌గా ఎదిగాడు. మొత్తం ఇప్పటివరకు కెరీర్లో 351 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. మూడు ఫార్మాట్లలో కలిపి 6641 పరుగులు, 597 వికెట్లు పడగొట్టాడు. టెస్టుల్లో నాలుగు సెంచరీలు బాదాడు.
ఫార్మాట్ల వారిగా జడేజా పెర్ఫార్మెన్స్
- టెస్టు -80 మ్యాచ్‌లు- 3370 పరుగులు, 323 వికెట్లు
- వన్డే - 197 మ్యాచ్‌లు -2756 పరుగులు, 220 వికెట్లు
- టీ20 - 74 మ్యాచ్‌లు - 515 పరుగులు - 54 వికెట్లు
జడేజా 'ట్రిపుల్ సెంచరీ' - టీమ్ఇండియా ఆల్‌రౌండర్ రేర్ రికార్డ్ - Ravindra Jadeja 300 Wickets
అశ్విన్, జడ్డు 'ది సేవియర్స్'- దెబ్బకు 24ఏళ్ల రికార్డు బ్రేక్ - Ind vs Ban Test Series 2024