Telugu Heros Lady Getup : సినిమా కోసం హీరోలు ప్రాణం పెట్టి పనిచేస్తుంటారు. పాత్రకు తగిన గెటప్‌లో కనిపించేందుకు ఎంతో కష్టపడుతుంటారు. ఒక్కోసారి మేకప్ కోసం గంటల సమయం కేటాయిస్తుంటారు. ప్రేక్షకుల మెప్పు కోసం ఎంతైనా శ్రమిస్తారు. అయా పాత్రలకు థియేటర్లలో వచ్చే పాజిటివ్ రెస్పాన్స్ చూసి వాళ్ల శ్రమ మర్చిపోతుంటారు.
ఈ మధ్య కాలంలో సినిమాలో పాత్రల కోసం హీరోల డెడికేషన్ ఎక్కువైంది. కథ డిమాండ్ మేకరు ఏ కాస్ట్యూమ్ అయినా ధరించి, డీగ్లామర్ రోల్స్‌లో నటించేందుకు కూడా సిద్ధపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల అల్లు అర్జున్ 'పుష్ప 2' సినిమాలో కథ డిమాండ్ మేరకు చీరలో కనిపించారు. తాజాగా యంగ్ హీరో విష్వక్సేన్ సైతం 'లైలా' సినిమా కోసం లేడీ గెటప్ వేశారు. అలా సినిమా కోసం లేడీ ఇప్పటివరకు లేడీ గెటప్‌లు వేసిన తెలుగు హీరోలు ఎవరో చూద్దామా?
- విష్వక్ సేన్ : యంగ్ హీరో విష్వక్ సేన్ లీడ్ రోల్లో, దర్శకుడు రామ్ నారాయణ్ తెరకెక్కించిన సినిమా 'లైలా'. ఈ సినిమాలో విష్వక్ లేడీ గెటప్‌లో కనిపించనున్నారు. టీజర్లో లేడీ గెటప్ లుక్ రివీల్ చేశారు.
Welcome to the world of #Laila filled with fun, action and romance ❤🔥
— VishwakSen (@VishwakSenActor) January 17, 2025
The Echipaad #LailaTeaser out now 💥💥
▶️ https://t.co/YHl8j4IgAK
GRAND RELEASE WORLDWIDE ON FEBRUARY 14th @RAMNroars #AkankshaSharma @leon_james @sahugarapati7 @Shine_Screens @JungleeMusicSTH pic.twitter.com/OQ5I4yzaJN
- అల్లు అర్జున్ : రీసెంట్ ఇండస్ట్రీ హిట్ 'పుష్ప 2' సినిమాలో బన్నీ చీర కట్టుకొని కనిపించారు. మూవీలో గంగమ్మ జాతర సీన్లో అమ్మవారి గెటప్ వేసి పూనకాలు ఊగిపోయారు. దీనికి ఆడియెన్స్ నుంచి భారీ స్పందన వచ్చింది. అంతకుముందు 'గంగోత్రి' సినిమాలోనూ బన్నీ అమ్మాయి గెటప్‌లో కనిపించారు.
Experience the WILDFIRE in 3D 🤩#Pushpa2TheRule Hindi version now playing in 3D across the country 💥💥
— Pushpa (@PushpaMovie) December 24, 2024
Book your tickets now!
🎟️ https://t.co/eJusnmNS6Y#Pushpa2#WildFirePushpa
Icon Star @alluarjun @iamRashmika @aryasukku #FahadhFaasil @ThisIsDSP @resulp @NavinNooli… pic.twitter.com/3AlqEeCoHF
- శ్రీ విష్ణు : టాలెంటెడ్ హీరో శ్రీ విష్ణు ఇటీవల 'శ్వాగ్' మూవీతో హిట్ అందుకున్నారు. ఈ సినిమాలో విష్ణు చీర కట్టుకొని లేడీ పాత్రలో అలరించారు.
Vibuthi is one the most special roles I’ve ever done and extremely grateful to the entire audience for making it very special with all your Love & Support ❤️#Swag #SwagTheFilm pic.twitter.com/DNHjLy0XI0
— Sree Vishnu (@sreevishnuoffl) October 7, 2024
- మంచు మనోజ్ : మంచు ఫ్యామిలీ హీరోలంతా కలిసి నటించిన సినిమా 'పాండవులు పాండవులు తుమ్మెద'. ఈ సినిమాలో మనోజ్ అమ్మాయి పాత్రలో చీర కట్టుకొని నటించారు.
- బాలకృష్ణ : మాస్ పాత్రలతో ఎంటర్టైన్ చేసే నందముూరి బాలయ్య కూడా లేడీ గెటప్‌లో ప్రేక్షకులను అలరించారు. ఆయన 'పాండురంగడు' సినిమాలో లేడీ గెటప్ వేశారు.
వీళ్లు కూడా
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి సైతం అమ్మాయి పాత్ర పోషించారు. ఆయన లీడ్ రోల్లో వచ్చిన 'చంటబ్బాయ్','పట్నం వచ్చిన పతివ్రవలు' సినిమాల్లో చిరు లేడీ గెటప్‌లో కనిపించారు. 'బాడీగార్డ్' సినిమా విక్టరీ వెంకటేశ్, 'యముడికి మొగుడు'లో అల్లరి నరేశ్ కూడా లేడీ గెటప్ల్లో కనిపించారు.
విశ్వక్ సేన్ 'లైలా' టీజర్ ఔట్- లేడీ గెటప్‌లో మాస్ కా దాస్
'పుష్ప' రేంజ్ సెట్ చేసిన లేడీ గెటప్- జాతర సీన్ వెనుక కథేంటంటే?