ETV Bharat / entertainment

'గేమ్ ఛేంజర్' ఫస్ట్​ డే కలెక్షన్స్ - వరల్డ్​వైడ్​గా ఎంత వసూలు చేసిందంటే? - GAME CHANGER DAY 1 COLLECTION

'గేమ్ ఛేంజర్' బాక్సాఫీస్​ కలెక్షన్స్ - వరల్డ్​వైడ్​గా తొలి రోజు ఎంత వసూలు చేసిందంటే?

GAME CHANGER DAY 1 COLLECTION
Ram Charan (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 11, 2025, 10:55 AM IST

Game Changer Day 1 Collection : కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్‌, గ్లోబల్​ స్టార్ రామ్​ చరణ్​ కాంబినేషన్​లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ 'గేమ్‌ ఛేంజర్‌'. భారీ అంచనాల మధ్య ఈ చిత్రం శుక్రవారం గ్రాండ్​గా విడుదలైంది. అయితే తాజాగా ఈ మూవీ తొలిరోజు కలెక్షన్స్​ను మేకర్స్​ ప్రకటించారు. వరల్డ్​వైడ్​గా ఈ సినిమా సుమారు రూ.186 కోట్లు వసుళ్లు సాధించినట్లు నిర్మాణ సంస్థ ఓ స్పెషల్ పోస్టర్​ ద్వారా తెలిపింది.

మరోవైపు ప్రముఖ టికెట్‌ బుకింగ్‌ ప్లాట్‌ఫామ్‌ బుక్‌ మై షోలో 'గేమ్‌ ఛేంజర్‌'కు తొలి రోజు 1.3 మిలియన్లకు పైగా టికెట్స్‌ అమ్ముడైనట్లు ఆ సంస్థ వెల్లడించింది. వారాంతంలో ఈ టికెట్‌ అమ్మకాలు పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోందని అభిమానులు ఆశిస్తున్నారు.

ఆ రెస్పాన్స్​ చూసి సంతోషంగా ఉంది : మెగాస్టార్ చిరంజీవి
మరోవైపు ఈ సినిమాలో అప్పన్న క్యారెక్టర్​కు మంచి రెస్పాన్స్ వస్తోంది. అందులో చెర్రీ నటనకు ఫిదా అయిన ప్రేక్షకులు ఆ పాత్రకు బాగా కనెక్ట్ అయ్యారు. దీంతో సోషల్‌ మీడియా వేదికగా అభిమానులు, సెలబ్రిటీలు ఆయనపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. తాజాగా రామ్ చరణ్ తండ్రి మెగా స్టార్ చిరంజీవి కూడా చెర్రీని పొగడ్తలతో ముంచెత్తారు.

"అప్పన్న, రామ్‌ నందన్‌ క్యారెక్టర్లకు చరణ్‌పై కురిపిస్తున్న ప్రశంసలను చూస్తుండటం నాకు ఎంతో సంతోషంగా ఉంది. కియారా అడ్వాణీ, ఎస్‌.జె. సూర్య, అంజలి, నిర్మాత దిల్‌ రాజు, డైరెక్టర్ శంకర్‌కు నా హృదయపూర్వక శుభాకాంక్షలు" అంటూ చెర్రీని అలాగే మూవీ టీమ్​ను చిరు అభినందించారు.

ఇదిలా ఉండగా, రామ్​చరణ్ సతీమణి ఉపాసన కూడా ఓ పోస్ట్ షేర్ చేశారు. 'గేమ్‌ ఛేంజర్‌' మూవీ రివ్యూలపై ఉపాసన స్పందించారు. తన భర్త చెర్రీకి కాంగ్రాంట్స్ చెప్పారు. 'కంగ్రాట్స్‌ డియర్‌ హస్బెండ్‌. ప్రతి విషయంలో మీరు నిజంగానే గేమ్‌ ఛేంజర్‌. లవ్‌ యూ' అని పోస్ట్‌ చేశారు. ఇక మెగా ఫ్యాన్స్​కు కూడా రామ్​చరణ్​కు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

'గేమ్ ఛేంజర్' రివ్యూ - డ్యూయెల్​ రోల్​లో చెర్రీ మెప్పించారా?

'గేమ్‌ ఛేంజర్‌' మేకర్స్ ట్విస్ట్​ - ఆ విజువల్స్​ కోసం వెళ్లిన ఫ్యాన్స్​కు నిరాశే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.