ETV Bharat / sports

స్మృతి మంధాన ఆల్​టైమ్ రికార్డ్- భారత తొలి ప్లేయర్​గా ఘనత - SMRITI MANDHANA RECORD

స్మృతి మంధాన రికార్డ్- భారత్​లోనే తొలి ప్లేయర్​గా ఘనత

Smriti Mandhana Record
Smriti Mandhana Record (Source : Getty Images)
author img

By ETV Bharat Sports Team

Published : Jan 10, 2025, 8:56 PM IST

Smriti Mandhana Record : భారత స్టార్ ప్లేయర్ స్మృతి మంధాన కెరీర్​లో మరో అరుదైన ఘనత సాధించింది. వన్డే ఫార్మాట్​ క్రికెట్‌లో అత్యంత వేగంగా 4000 పరుగుల మార్క్ అందుకున్న భారత తొలి మహిళా ప్లేయర్​గా రికార్డు సృష్టించింది. మంధాన 95 ఇన్నింగ్స్​ల్లోనే ఈ ఫీట్ సాధించింది. శుక్రవారం ఐర్లాండ్​తో జరిగిన తొలి వన్డేలో 40 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద స్మృతి ఈ మైలురాయి అందుకుంది.

కాగా, మహిళల క్రికెట్​లో భారత్ నుంచి మంధాన ఈ ఫీట్ సాధించిన రెండో ప్లేయర్​గా నిలిచింది. మాజీ ప్లేయర్ మిథాలీ రాజ్ (112 ఇన్నింగ్స్​), మంధాన కంటే ముందు 4000 పరుగుల మార్క్​ టచ్ చేసింది. ఓవరాల్​గా వన్డేల్లో 4000+ పరుగులు సాధించిన 15వ ప్లేయర్​గా మంధాన నిలిచింది. ఇక వరల్డ్​వైడ్​గా అత్యంత వేగంగా ఈ మైలురాయి అందుకున్న మూడో ప్లేయర్​గా ఘనత సాధించింది.

ఓవరాల్​గా వన్డేల్లో వేగంగా 4000+ మార్క్ అందుకున్న ప్లేయర్లు

  • బెలిండా క్లార్క్ (ఆస్ట్రేలియా) - 86 ఇన్నింగ్స్​
  • మెగ్ లాన్నింగ్ (ఆస్ట్రేలియా) - 87 ఇన్నింగ్స్
  • స్మృతి మంధాన (భారత్) - 95 ఇన్నింగ్స్​లు
  • లారా వోల్వార్డ్ (సౌతాఫ్రికా) - 96 ఇన్నింగ్స్
  • కరేన్ రోల్టన్ (ఆస్ట్రేలియా) - 103 ఇన్నింగ్స్
  • సుజీ బీట్స్ (న్యూజిలాండ్) - 105 ఇన్నింగ్స్

Mandhana ODI Career : ఇక 2013లో వన్డే అరంగేట్రం చేసిన మంధాన తక్కువ కాలంలోనే కీలక ప్లేయర్​గా ఎదిగింది. 12ఏళ్లుగా జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తూ అనేక విజయాలు అందించింది. ఇప్పటివరకు 95 మ్యాచ్​ల్లో 44.95 సగటుతో మంధాన 4001 పరుగులు చేసింది. ఇందులో 9 సెంచరీలు, 29 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

ఇక మ్యాచ్ విషయానికొస్తే, భారత్ 6 వికెట్ల తేడాతో నెగ్గింది. 239 పరుగుల టార్గెట్​ను నాలుగు వికెట్లు కోల్పోయి 34.3 ఓవర్లలోనే ఛేదించింది. స్మృతి మంధాన (41 పరుగులు, 29 బంతుల్లో : 6 x4, 1x6) శుభారంభం అందించింది. మరో ఓపెనర్ ప్రతీకా రావల్ (89 పరుగులు), తేజస్ (53 పరుగులు) రాణించారు.

టాప్-3లోకి దూసుకొచ్చిన స్మృతి మంధాన

స్మృతి మంధాన ఆల్‌టైమ్ రికార్డ్ - ఏడాదిలో నాలుగోది

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.