Cricketer Divorce Rumours : భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్- భార్య ధనశ్రీ వర్మ విడిపోతున్నారనే వార్తలు రోజు రోజుకూ ఊపందుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో టీమ్ఇండియాలో మరో క్రికెటర్ కూడా ఇదే బాటలో వెళ్తున్నాడా? అంటే ఔను అనే సమాధానమే వినిపిస్తోంది! అతడు ఎవరో కాదు స్టార్ ప్లేయర్ మనీశ్ పాండేనే. అతడు తన భార్య అశ్రిత శెట్టితో డివోర్స్ తీసుకోనున్నాడంటూ జోరుగా ప్రచారం సాగుతోంది.
అయితే ఇప్పటివరకూ డివోర్స్ తీసుకున్న సెలబ్రిటీలు ముందుగా సోషల్ మీడియాలో తమ పెళ్లి ఫొటోలు తీసేసి క్లూ ఇచ్చారు. తాజాగా మనీశ్- అశ్రిత విషయంలోనూ ఇదే జరిగింది. మనీశ్, అశ్రిత శెట్టి సోషల్ మీడియా వేదిక ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అన్ ఫాలో చేసుకున్నారు. దీంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. మొదట ఆశ్రిత తన సోషల్ మీడియాలో మనీశ్ పాండే ఫొటోలను తీసివేయగా, మనీశ్ సైతం అదే పని చేస్తూ ఆమెను అన్ ఫాలో కొట్టేశాడు. దీంతో ఈ జంట కూడా విడాకుల తీసుకొనుందని కథనాలు వస్తున్నాయి.
2019లో ఒక్కటైన జంట
మనీశ్ పాండే- అశ్రిత శెట్టి 2019లో మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. కర్ణాటకకు చెందిన అశ్రిత పలు తమిళ సినిమాల్లో నటించింది. పెళ్లైన తర్వాత చాలాసార్లు ఐపీఎల్ మ్యాచ్‌ల్లో తన భర్తకు మద్దతుగా మైదానానికి వచ్చింది. వివాహమైన కొత్తలో ఈ జంట తరచూ కలిసి కనిపించేవారు. అలాగే సోషల్ మీడియాలో వారిద్దరూ కలిసి ఉన్న ఫొటోలను పోస్ట్ చేసేవారు. ఇటీవల కాలంలో ఒకరినొకరు అన్ ఫాలో చేసుకోవడం, ఇద్దరు కలిసి ఉన్న ఫొటోలు కూడా వారి ఖాతాల నుంచి తొలగించడం గమనార్హం.
కాగా, మనీశ్ పాండే టీమ్ఇండియా తరఫున 29 వన్డేలు, 39 టీ20లు ఆడాడు. వన్డేల్లో 566 పరుగులు, టీ20ల్లో 709 రన్స్ బాదాడు. మనీశ్ పాండే జాతీయ జట్టు తరఫున పెద్దగా రాణించలేకపోయినా, ఐపీఎల్ లో మాత్రం మంచి రికార్డు ఉంది. 172 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన మనీశ్ 3850 రన్స్ చేశాడు. ఇందులో ఒక సెంచరీ, 22 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఈ ఏడాది నిర్వహించన ఐపీఎల్ మెగా వేలం 2025లో మనీశ్‌ను కోల్ కతా నైట్ రైడర్స్ రూ.75 లక్షలకు దక్కించుకుంది.
'డివోర్స్ రూమర్స్‌పై చాహల్ ఫస్ట్ రియాక్షన్- ఫ్యామిలీ నేర్పింది ఇదేనట!'
చాహల్ డివోర్స్ రూమర్స్! - వైరలవుతోన్న ధనశ్రీ ఇన్‌స్టా పోస్ట్