ETV Bharat / state

పట్నం ఖాళీ అవుతోంది : హైదరాబాద్​ - విజయవాడ రహదారిపై నిమిషానికి 330 వాహనాలు - TRAFFIC JAM AT NATIONAL HIGHWAY

అబ్దుల్లాపూర్‌మెట్ ఓఆర్‌ఆర్‌ వద్ద భారీగా ట్రాఫిక్‌ జామ్‌ - సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే వాహనాలతో కిక్కిరిసిపోయిన రహదారి - విజయవాడ జాతీయ రహదారి వద్ద ట్రాఫిక్‌ను నియంత్రిస్తున్న పోలీసులు

Huge Traffic jam At Hyderabad Vijayawada Highway
Huge Traffic jam At Hyderabad Vijayawada Highway (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 11, 2025, 10:50 AM IST

Updated : Jan 11, 2025, 11:20 AM IST

Huge Traffic jam At Hyderabad Vijayawada Highway : రెండు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి మొదలైంది. పండుగను బంధుమిత్రులతో కలిసి జరుపుకొనేందుకు నగరవాసులు సొంత ఊళ్లకు బయలుదేరడంతో హైదరాబాద్​-విజయవాడ జాతీయ రహదారి వాహనాలతో కిక్కిరిసిపోయింది. అబ్దుల్లాపూర్​మెట్​ ఔటర్​ రింగ్​ రోడ్డు నుంచి కొత్తగూడెం వరకు వాహనాలు నత్తనడకన సాగుతున్నాయి. మరోవైపు పెద్ద అంబర్​పేట్​ ఔటర్​ రింగ్​ రోడ్డుపై భారీగా ట్రాఫిక్​ జామ్​ ఏర్పడింది. ఔటర్​పై వాహనాలు బారులు తీరాయి. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

పల్లెబాట పట్టిన జనం - హైదరాబాద్​ - విజయవాడ రహదారిపై భారీగా ట్రాఫిక్​ జామ్ (ETV Bharat)

10 టోల్​బూత్​లను విజయవాడవైపు తెరిచిన అధికారులు : విజయవాడ - హైదరాబాద్ జాతీయ రహదారిపై గత రాత్రి నుంచి కొనసాగుతున్న వాహనాల రద్దీ కారణంగా యాదాద్రి భువనగిరి జిల్లా పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ భారీగా కొనసాగుతుంది. రద్దీనీ నియంత్రించేందుకు టోల్ ప్లాజా సిబ్బంది, పోలీసులు ట్రాఫిక్ జామ్ కాకుండా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. వాహనాల రద్దీ దృష్ట్యా 10 టోల్ బూత్​లను విజయవాడ వైపు తెరిచారు.

4 సెకండ్లకు ఒక వాహనం చొప్పున : సాధారణ రోజుల్లో 35,000 నుంచి 45,000 వాహనాలు వెళ్తాయని, సంక్రాంతి పండుగ సందర్భంగా మాత్రం శుక్రవారం ఒక్క రోజే 55 వేల వాహనాలు వెళ్లినట్లు ఇక్కడి అధికారులు చెబుతున్నారు. ఈరోజు జాతీయ రహదారిపై వాహనాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని, అందుకు తగ్గట్టుగానే ఇక్కడ వాహనదారులకు ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు ఎప్పటికప్పుడు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నాలుగు సెకండ్లలో ఒక వాహనం చొప్పున టోల్ ప్లాజా నుంచి వెళ్తుంది. నిమిషానికి 330 వాహనాలు విజయవాడ వైపు వెళ్తున్నట్లు సమాచారం.

ప్రైవేటు ట్రావెల్స్​ బస్సులకు తనిఖీలు : సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై రవాణా శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. రంగారెడ్డి జిల్లా ఉప రవాణా శాఖ అధికారి సదానందం ఆదేశాల మేరకు తెల్లవారుజామునుంచి రాజేంద్రనగర్ ఆరాంఘర్ చౌరస్తా వద్ద ప్రైవేటు ట్రావెల్స్ బస్సులపై రవాణా శాఖ అధికారులు

తనిఖీలు చేపట్టి నిబంధనలు పాటించని వాటిపై చర్యలు చేపట్టారు. చెన్నై,తిరువంతపురం,పాండిచ్చేరి,మంగళూరు, మైసూరు,కన్యాకుమారి నుండి హైదరాబాద్ వస్తున్న బస్సులను తనిఖీలు చేశారు. నిబంధనలను అతిక్రమించిన 11 ట్రావెల్స్ బస్సులను సిజ్ చేసి కేసులు నమోదు చేశారు.

సంక్రాంతికి ఊరెళ్తున్నారా? - ఈ రూట్​లలో వెళితే ఆగకుండా సాగిపోవచ్చు!

కిక్కిరిసిన హైదరాబాద్ - విజయవాడ హైవే - ఎల్బీనగర్ వద్ద భారీగా ట్రాఫిక్​జామ్

Last Updated : Jan 11, 2025, 11:20 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.