ETV Bharat / health

'ఇవి తింటే పీరియడ్స్ నొప్పులు తగ్గుతాయి'- డైట్​లో చేర్చుకోవాలని వైద్యుల సలహా! - FOODS TO EAT PERIOD PAIN

-వీటిని పరగడుపున తినాలని వైద్యుల సలహా -ఈ టిప్స్ పాటిస్తే సహజంగానే తగ్గించుకోవచ్చట!

foods to eat period pain
foods to eat period pain (Getty Images)
author img

By ETV Bharat Health Team

Published : Jan 11, 2025, 10:35 AM IST

Periods Pain Relief Tips: పీరియడ్స్ సమయంలో పొత్తి కడుపులో నొప్పి, నడుము నొప్పి, మూడ్ స్వింగ్స్ వంటివన్నీ సహజంగానే ఉంటాయి. అయితే ఇలాంటి శారీరక నొప్పుల నుంచి ఉపశమనం పొందడానిక్ పెయిన్ కిల్లర్స్ వాడుతుంటారు చాలా మంది. కానీ, ఇలాంటివి వాడకుండా మన వంటింట్లో లభించే కొన్ని ఆహార పదార్థాలను రోజువారీ డైట్‌లో చేర్చుకుంటే సరిపోతుందని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

పరగడుపున ఇవి
నెలసరి నొప్పుల్ని దూరం చేయడంలో కుంకుమ పువ్వు, నల్ల ఎండు ద్రాక్ష సమర్థంగా పనిచేస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇందుకోసం రెండు వేర్వేరు గిన్నెలు తీసుకొని ఒక దాంట్లో నాలుగైదు ఎండుద్రాక్షలు, మరొక దాంట్లో రెండు కుంకుమపువ్వు రెబ్బలు వేసి కొన్ని నీళ్లు పోసి రాత్రంతా నానబెట్టాలని అంటున్నారు. అనంతరం మరుసటి రోజు ఉదయం పరగడుపున గ్లాసు నీళ్లు తాగి.. ఆ తర్వాత నానబెట్టిన ఎండు ద్రాక్ష, కుంకుమ పువ్వు తినాలని వివరిస్తున్నారు. ఇలా చేయడం వల్ల నెలసరి సమయంలో ఎదురయ్యే శారీరక నొప్పులే కాకుండా.. మూడ్‌ స్వింగ్స్‌నీ దూరం చేసుకోవచ్చని నిపుణులు అంటున్నారు. ఎండు ద్రాక్షలోని ఐరన్‌, ఫైబర్‌, ఖనిజాలు ఇందుకు సాయం చేస్తాయని పేర్కొన్నారు. అలాగే రక్తహీనత, మలబద్ధకం వంటి సమస్యలకు కూడా దూరంగా ఉండచ్చని తెలిపారు.

దుంపలతో
నెలసరి నొప్పుల్ని, ఆ సమయంలో ఎదురయ్యే అసౌకర్యాన్ని దూరం చేసుకోవాలంటే వారానికి 3-4 రోజులు కొన్ని దుంప కూరలను తప్పకుండా ఆహారంలో చేర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా దుంప జాతికి చెందిన చేమ దుంప, చిలగడదుంప, బంగాళాదుంప వంటి కాయగూరలు ఈ సమయంలో నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తాయని వివరిస్తున్నారు. వీటిలో ఫైబర్‌, పాలీఫినాల్స్‌ వంటివి అధికంగా ఉంటాయని తెలిపారు. అలాగే నెలసరి సమయంలో చాలా మందిలో తలెత్తే మొటిమలు, జుట్టు రాలిపోవడం వంటి సమస్యలు కూడా ఇది చెక్ పెడుతుందని అంటున్నారు. అందుకే చర్మ, జుట్టు ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలంటే దుంపలు కచ్చితంగా తీసుకోమని నిపుణులు పేర్కొన్నారు.

స్నాక్స్‌గా అరటి పండు!
నెలసరి నొప్పులకు అరటిపండు అద్భుతమైన ఔషధంగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. సాయంత్రం స్నాక్స్‌ సమయంలో దీన్ని తీసుకోవడం వల్ల రాత్రి పూట మితంగా ఆహారం తీసుకునే వీలుంటుందని.. తద్వారా రాత్రుళ్లు హాయిగా నిద్ర పడుతుందని అంటున్నారు. ఇంకా శరీరంలో హార్మోన్లను సమతులంగా ఉంచుకోవడానికి ఇది ఉపయోగపడుతుందన్నారు. ఇందులో పుష్కలంగా లభించే ఫైబర్‌, పొటాషియం, విటమిన్‌ ‘బి’ వంటి పోషకాలు.. ఈ సమయంలో కొంతమందిలో ఎదురయ్యే కడుపుబ్బరం నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుందని వివరిస్తున్నారు. అరటి పండుతో పాటు అరటి కాయ, అరటి పువ్వును వంటకాల్లో భాగం చేసుకొని తీసుకోవచ్చని పేర్కొన్నారు. హార్మోన్లను సమతులంగా ఉంచడంలో అరటి పువ్వు కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు తెలిపారు. 2018లో Journal of Women's Healthలో ప్రచురితమైన "Dietary intake of potassium and menstrual cramp severity" అనే అధ్యయనంలోనూ ఈ విషయం తేలింది. (రిపోర్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

నైట్​ డ్యూటీ చేసే వారికి షుగర్ వ్యాధి​ వస్తుందా? డాక్టర్లు ఏం అంటున్నారో తెలుసా?

ఇనుప కడాయిలో కూరలు వండుతున్నారా? ఈ సమస్యలు వచ్చే అవకాశమట!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.