Actress Adopted Cheetah Babies : సినిమాల్లోకి రావడానికి అర్హత కేవలం ప్రతిభ మాత్రమే. ఆ ఒక్కటీ ఉంటే ఏ రంగానికి చెందిన వారైనా వెండితెరపై వెలిగిపోవచ్చు. ఈ జాబితా మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌గా మొదలై టాప్ హీరోయిన్‌గా మారిన దియా మీర్జా అందరికీ ఆదర్శం. ఆమె యాక్టింగ్, ప్రొడక్షన్‌లో బిజీగా ఉంటూ కూడా మూగ జీవులకు సమయం కేటాయిస్తుంది. ఆమె కెరీర్‌కి సంబంధించిన ఆసక్తికర విషయాలు ఇప్పుడు చూద్దాం.
దియా మీర్జా కెరీర్
దియా మీర్జా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వక ముందు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌గా తన కెరీర్‌ను ప్రారంభించింది. అలాగే మోడల్‌గానూ వర్క్ చేసింది. 2000లో 'మిస్ ఆసియా పసిఫిక్ ఇంటర్నేషనల్' టైటిల్ గెలిచిన తర్వాత తనకు మరింత పాపులారిటీ పెరిగింది. దీంతో ఆమె పలు టాప్ బ్రాండ్‌లకు మోడల్‌గానూ మెరిసింది. అయితే తన బిజీ షెడ్యూల్ కారణంగా గ్రాడ్యుయేషన్ పూర్తి చేయలేకపోయింది.
బాలీవుడ్ జర్నీ
2001లో 'రెహనా హై తేరే దిల్ మే' అనే చిత్రం ఆమెకు పెద్ద బ్రేక్ ఇచ్చింది. ఆ సినిమా హిట్ అవ్వడం వల్ల తను బాలీవుడ్‌లో ఓవర్‌నైట్ సెన్సేషన్‌గా మారింది. ఇక దియా అరంగేట్రం నుంచి 'దియా దస్', 'లగే రహో మున్నా భాయ్', 'సంజు', 'థప్పడ్', 'భీద్' వంటి హిట్ సినిమాల్లో మెరిసింది. చివరిసారిగా 'ధక్ ధక్'లో కనిపించింది. ఓటీటీలో 'కాఫిర్', 'IC 814: ది కాందహార్ హైజాక్' సిరీస్‌లతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.
నిర్మాత, సామాజిక కార్యకర్త
కేవలం నటనకే పరిమితం కాకుండా దియా 2019లో తన సొంత ప్రొడక్షన్ హౌస్ 'వన్ ఇండియా స్టోరీస్'ని ప్రారంభించింది. అలానే పర్యావరణ పరిరక్షణ, వన్యప్రాణుల సంరక్షణ కోసం పని చేసింది. 2010లో ఆమె లఖ్‌నవూ జూ పార్క్ నుంచి అశోక, నక్షత్ర అనే రెండు చిరుతపులి పిల్లలను దత్తత తీసుకుంది.
వ్యక్తిగత జీవితం
దియా 2014లో సాహిల్ సంఘాను వివాహం చేసుకుంది. అయితే 2019లో ఈ జంట విడిపోయారు. 2021లో ఆమె వైభవ్ రేఖీని రెండో వివాహం చేసుకుంది. ఆమెకు ఓ కుమారుడు, కుమార్తె(వైభవ్ మొదటి భార్య కుమార్తె) ఉన్నారు.
బిగ్‌బీతో ఫస్ట్ మూవీ, ఆమిర్‌తో బ్లాక్‌బస్టర్ - ఆ కారణం వల్ల ఓ సినిమా నుంచి ఔట్! - ఎవరా నటి?
బడ్జెట్ రూ.30కోట్లు - కలెక్షన్ రూ.3కోట్ల - థియేటర్లలో ఢీలా, ఓటీటీలో అదిరిపోలా!