ఆర్టీసీ బస్సులో ప్రసవించిన మహిళ- పండంటి బిడ్డకు జన్మ- ఇద్దరూ సేఫ్ - Woman Gave Birth To Baby In Bus - WOMAN GAVE BIRTH TO BABY IN BUS
Published : May 31, 2024, 1:03 PM IST
Woman Delivery On Bus Viral Video : బస్సులో గర్భిణీ ప్రసవించిన ఘటన కేరళలో జరిగింది. తట్టిల్పాలం నుంచి అంగమలై వెళుతున్న KSRTC బస్సులో ప్రయాణిస్తున్న 37 ఏళ్ల సెరీనాకు పురిటి నొప్పులు వచ్చాయి. పెరమంగళం పోలీసు స్టేషన్‌కు చేరే సమయానికి నొప్పులు ఎక్కువయ్యాయి. ఈ క్రమంలో డ్రైవర్ బస్సును త్రిస్సూర్‌లోని అమలా ఆస్పత్రి వైపునకు మళ్లించాడు. బస్సు ఆస్పత్రికి చేరుకున్నాక సెరీనా పరిస్థితిని పరిశీలించిన వైద్యులు, ఆమెను వార్డుకు తీసుకెళ్లే సమయం లేదని గ్రహించారు.
మహిళ డెలివరీకి కావల్సిన వైద్య సామగ్రి, మందులను బస్సు వద్దకే రప్పించారు. అనంతరం వాటిని బస్సు లోపలికే తీసుకెళ్లి ప్రసవం పూర్తి చేశారు వైద్యులు. ఆ తర్వాత తల్లీబిడ్డలను ఆస్పత్రికి తరలించి మెరుగైన చికిత్స అందించారు. ఈ విషయంపై అమలా ఆస్పత్రి వైద్యులు యాసిర్ సులైమాన్ మీడియాతో మాట్లాడారు. "బస్సు నుంచి మహిళను అత్యవసర విభాగానికి మార్చడం అసాధ్యం. అందుకే అక్కడే ప్రసవం చేశాం" అని తెలిపారు.