తెలంగాణ

telangana

ETV Bharat / videos

హైవేపై భారీ కొండచిలువ హల్​చల్​! 12 అడుగుల పైథాన్ చూసి అంతా హడల్!! - Python Video - PYTHON VIDEO

By ETV Bharat Telugu Team

Published : Jul 10, 2024, 11:09 AM IST

Python Viral Video : ఉత్తరాఖండ్​లోని రిషికేశ్​లో భారీ కొండచిలువ హల్ చల్ చేసింది. రిషికేశ్ హరిద్వార్ జాతీయ రహదారిపైకి అడవి నుంచి వచ్చేసింది. 12 అడుగుల పైథాన్​ను చూసిన స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అయితే కొద్దిసేపు రోడ్డుపై రాకపోకలు నిలిచిపోయాయి. కొండచిలువను కాపాడేందుకు డ్రైవర్లు తమ వాహనాలను హైవేపై నిలిపివేశారు. ఆ తర్వాత పైథాన్​ రోడ్డు దాటి మళ్లీ అడవిలోకి వెళ్లిపోయింది. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. 

మంగళవారం రాత్రి జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్​గా మారింది. అయితే గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. అందుకే కొండచిలువ రోడ్డుపైకి వచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు. మరోవైపు, ఇటీవల వరదల్లో కొట్టుకుపోయిన 17 ఏళ్ల బాలిక మృతదేహం లభ్యమైనట్లు మంగళవారం ముఖ్యమంత్రి పుష్కర్‌ సింగ్‌ ధామీ ప్రకటించారు. దీంతో రాష్ట్రంలో గడిచిన 24గంటల్లో వరదల కారణంగా మృతిచెందిన వారి సంఖ్య మూడుకు చేరుకుంది.

ABOUT THE AUTHOR

...view details