Couple Celebrated Cradle Ceremony For Calves In Vikarabad : ఇంట్లో పెంచుకునే కుక్కలు, పిల్లులకు పుట్టిన రోజులు జరపడం చూస్తుంటాం. వాటి బర్త్‌డేలు చేసి ఆ వీడియోలు సోషల్ మీడియాలో పంచుకుంటారు. కేక్ కట్ చేయడం, పుట్టిన రోజు సందర్భంగా దానికి ఏం స్పెషల్ ఫుడ్ పెట్టారు ఇలా ప్రతి ఒక్కదాన్ని షూట్ చేసి పోస్ట్ చేస్తుంటారు. ఇవన్ని కుక్కలు, పిల్లుల వరకే పరిమితం అవుతాయి. అవి చిన్నగా ఉంటాయి, ఇంటి లోపలే పెరుగుతాయి అందువల్ల ఇలాంటివి వాటికే చేస్తుంటారు.
బర్రెలు, ఆవులను మాత్రం పక్కన పెట్టేస్తుంటారు. పండుగలు వచ్చినప్పుడు వాటికి పూజలు చేస్తుంటారు. దేవుడిగా భావిస్తుంటారు. ఈ కుటుంబీకులు మాత్రం అలా అనుకోలేదు. పెంచుకున్న ఆవును కుటుంబంలో మనిషే అనుకున్నారు. అది గర్భం దాల్చినప్పటి నుంచి ఒక మనిషిని ఎలా జాగ్రత్తగా చూసుకుంటారో అలానే చూసుకున్నారు. అది లేగ దూడకు జన్మనిచ్చిన తర్వాత ఏయే కార్యక్రమాలు చేస్తారో అన్ని జరిపించారు.
Barasala for calves in Medak : లేగ దూడలకు బారసాల.. ఎక్కడంటే..?
మాలో ఒకటి అంటూ : వికారాబాద్ జిల్లా మోమిన్‌పేట్ మండలం ఎన్కతల గ్రామానికి చెందిన కుమ్మరి అంజయ్య, కమలమ్మ దంపతులు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వాళ్లు ఒక ఆవును పెంచుకుంటున్నారు. అయితే ఇటీవలే ఆ ఆవుకు లేగ దూడ జన్మించింది. అయితే ఇంట్లో పిల్లలు పుడితే ఎలా కార్యక్రమాలు చేస్తారో అలా ఆవుకు జన్మించిన లేగ దూడకు అన్ని కార్యక్రమాలు చేశారు. మొదటగా ఆవుకి పురుడు కార్యక్రమం చేశారు. పిల్లలు పుట్టిన 21 రోజులకు అందరూ బారసాల చేస్తారు. ఊయలలో వేసి, వారికి పేరు పెట్టే తంతు నిర్వహిస్తారు.
గురువారం లేగ దూడ జన్మించి 21 రోజులు కావడంతో బారసాల కార్యక్రమం చేశారు. అందుకు ఊళ్లో వాళ్లని ఆహ్వానించారు. దూడను ఊయలలో వేసి పాటలు పాడారు. వచ్చిన వారికి విందు భోజనాలు కూడా ఏర్పాటు చేశారు. రకరకాల పాటలతో బారసాల కార్యక్రమం సందడిగా జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆవు మీద ప్రేమతో ఈ తంతు నిర్వహించడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ఇదంతా చూస్తే గ్రామ ప్రజలు పాడి పశువులతో ఎంత ప్రేమతో ఉంటారో అనడానికి ఇదో ఉదాహరణగా చెప్పవచ్చు.
గాడిదలకు సీమంతం, బారసాల.. ప్రజల సంబరాలు.. అందుకోసమేనట!
కుక్క పిల్లకు బారసాల.. లాలిపాటలు పాడుతూ వేడుక.. పేరేం పెట్టారంటే?